ప్లాస్టిక్, కాస్మెటిక్, ఎస్తటిక్ సర్జరీలకు పేరొందిన హెచ్కే హాస్పిటల్స్, గచ్చిబౌలిలోని లుంబినీ ఎంక్లేవ్లో ఏర్పాటైంది. ఇక హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుక సినీ ప్రముఖులు, సెలబ్రెటీలతో కళకళలాడింది. అత్యాధునిక సదుపాయాలు, నిపుణుల సంరక్షణతో ప్రపంచ స్థాయి ఎస్తటిక్, రికన్స్ట్రక్టివ్ చికిత్సలను ఒకేచోట అందించేందుకు నెలకొల్పిన ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి, టాలీవుడ్ ప్రముఖులు బిగ్బాస్ తెలుగు స్టార్లు వెళ్లి సందడి చేశారు. ఈ లాంచ్ లో సంగీత దర్శకుడు మణిశర్మ, కమెడియన్ అలీ, నటి అనసూయ, నటుడు సంతోష్ శోభన్ పాల్గొన్నారు. దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్కేఎన్, దీప్తి సునైనా, గీతూ, సీత, కీర్తి భట్, సిరి శ్రీహాన్, నిఖిల్ విజయేంద్ర సింహా, శివజ్యోతి గంగూలీ, సంపూర్ణేష్ బాబు, జస్వంత్ జెస్సీ, శ్రవంతి చోకారపు వంటి పలువురు ప్రముఖులు పాల్గొని హెచ్కే హాస్పిటల్స్ మేనేజ్మెంట్కు శుభాకాంక్షలు తెలిపారు.