Site icon NTV Telugu

Tollywood : ఒక్క ఫ్లాప్‌తో మనసు మార్చుకుంటున్న హీరో, దర్శకనిర్మాతలు

Tollywood (1)

Tollywood (1)

ఒక్క సినిమా హిట్‌ అయినా, ఫ్లాప్‌ అయినా హీరోలు, దర్శకనిర్మాతల కెరీర్‌ ట్రాక్‌ను పూర్తిగా మార్చేస్తుంది. ఈ మధ్య టాలీవుడ్‌, కోలీవుడ్‌ లోనూ ఇదే ట్రెండ్‌ బలంగా కనిపిస్తోంది. హిట్‌ కొట్టినప్పుడు కొత్త ప్రాజెక్టులు వరస కట్టుతుంటాయి. కానీ ఒక్క ఫ్లాప్‌ పడగానే ఆఫర్స్‌ వెనక్కి వెళ్లిపోతాయి, ఇప్పటికే ప్లాన్‌ చేసిన సినిమాలు హోల్డ్‌లో పడిపోతాయి. ఎన్టీఆర్‌ వరుస విజయాల తరువాత వార్‌2లో బిజీ అయ్యాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్‌గా మారడంతో, తారక్‌ తన పూర్తి దృష్టిని దేవర2పై కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఒక్క ఫ్లాప్‌ తన కెరీర్‌ను తాకకుండా జాగ్రత్తపడుతున్నాడు.

Also Read : Kantara Chapter 1: బాప్‌రే.. 7 వేల స్క్రీన్‌లలో ‘కాంతార: చాప్టర్‌1’ రిలీజ్!

విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’ బాక్స్‌ఆఫీస్‌ వద్ద బోల్తా కొట్టడంతో, అతని తదుపరి భారీ ప్రాజెక్ట్‌ జనగణమణ నిలిచిపోయింది. ఒక ఫ్లాప్‌ వల్ల ఎంతటి పెద్ద ప్రాజెక్ట్‌ కూడా నిలిచిపోతుందో దీనితో స్పష్టమవుతుంది. తాజాగా ‘తమ్ముడు’ ఫ్లాప్‌తో దాని తరువాత ప్లాన్‌ చేసిన ఎల్లమ్మ సినిమాను మేకర్స్‌ పక్కన పెట్టేశారు. లోకేశ్‌ కనగరాజ్‌ సినిమాలు ఎప్పుడూ స్టైలిష్‌గా, కమర్షియల్‌గా ఉంటాయి. ఆయన ‘ఖైదీ’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. చాలా కాలంగా ఖైదీ2పై ప్లాన్‌ చేస్తున్నప్పటికీ, పెద్ద స్టార్స్‌ నుంచి ఆఫర్స్‌ రావడంతో ఆ ప్రాజెక్ట్‌ను లైట్‌గా తీసుకున్నాడు. కూలీ సినిమా బాక్స్‌ఆఫీస్‌ వద్ద బోల్తా కొట్టడంతో, అమీర్‌ ఖాన్‌తో ప్లాన్‌ చేసిన సినిమా, కమల్‌-రజనీకాంత్‌ మల్టీస్టారర్‌ ప్రాజెక్ట్‌లు కూడా క్యాన్సిల్‌ అయినట్లు సమాచారం. ఇప్పుడు తిరిగి ఖైదీ2పై దృష్టిపెట్టే అవకాశం ఉందని టాక్‌.

Also Read :MP: కూలీ పని చేసి భార్యను పోలీసుని చేసిన భర్త.. ఎఫైర్ పెట్టుకుని భర్తనే బెదిరించిన మహాతల్లి

హిట్‌ పడితే కన్నూమిన్నూ తెలియని పరిస్థితి. ఒక్క ఫ్లాప్‌ పడగానే ఆకాశంలో విహరిస్తున్నవాళ్లు భూమ్మీదకు వస్తారు. ఫామ్‌లో ఉన్నప్పుడు వెనకపడినవాళ్లను పట్టించుకోరు. కానీ ఎదురు దెబ్బ తగలగానే అసలు విషయం బోధపడుతుంది. ఇది కేవలం లోకేశ్‌ కనగరాజ్‌ విషయంలోనే కాదు, తారక్‌ లాంటి స్టార్‌ హీరోల విషయంలోనూ జరుగుతోంది. మొత్తానికి, హిట్లు – ఫ్లాపులు హీరోల కెరీర్‌ను మలుపు తిప్పే ప్రధాన అంశాలు అనేది మళ్లీ మరోసారి రుజువైంది.

Exit mobile version