Hit-2 Trailer : విశ్వక్ సేన్ హీరోగా నాచురల్ స్టార్ నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిత్రం ‘హిట్’. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ సినిమాకి సీక్వెల్ ఉంటుందని అప్పుడే మేకర్స్ ప్రకటించారు. కాగా రెండేళ్ళ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కింది. హిట్ 2లో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఉత్కంఠ భరితంగా సాగిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Read Also: Largest Screen of the Country: హైదరాబాద్ సినీ ప్రియులకు గ్రేట్ న్యూస్.. దేశంలో అతిపెద్ద స్క్రీన్
పోలీసులకు చిక్కకుండా వరుస హత్యలు చేస్తున్న హంతకుడిని అడివిశేష్ ఎలా పట్టుకున్నాడు అనే నేపథ్యంలో చిత్రం తెరకెక్కింది. ట్రైలర్ ప్రారంభంలో ఒక అమ్మాయినే హత్య చేశారని అందరూ అనుకుంటుండగా.. చివర్లో తల ఒకరిది, కాళ్లు ఒకరివి, చేతులు ఒకరివి అంటూ రివీల్ చేయడం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. జాన్ స్టీవర్ట్ నేపథ్య సంగీతం థ్రిల్ ఫీల్‌ను కలిగిస్తుంది. మణికందన్ కెమెరా విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌తోనే సినిమాపై విపరీతమైన ఆసక్తి పెరిగింది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం హిట్ యూనివర్స్‌లో భాగంగా రూపొందింది.ఈ సినిమా డిసెంబర్ 2న పాన్ తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. అలాగే హిట్ వర్స్ అని ఒక లోకం సృష్టించి వరుసగా 7 సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నట్టు చిత్ర బృందం పేర్కొంది. ఒక్కో సినిమాలో ఒక్కో హీరో ఉండనున్నట్టు, మధ్యలో ఆ హీరోలు కలవొచ్చు అన్నట్టు దర్శకుడు శైలేష్ కొలను చెప్పడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
Read Also: Moinabad Farm House Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు.. మరో ఇద్దరికి సిట్ నోటీసులు
