Hey Chikitha: “పవనిజం బ్యాక్‌డ్రాప్‌లో రైతుల పోరాటం.. కేవలం 21 రోజుల్లోనే షూటింగ్!”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవనిజం ఆరా, పల్లెటూరి రైతుల జీవన విధానాన్ని జోడిస్తూ అవుట్ అండ్ అవుట్ రియలిస్టిక్ కమర్షియల్ ఎంటర్టైనర్గా వస్తోన్న చిత్రం “హే చికీతా”. అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పి బ్యానర్లపై ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రైటర్ ధన్ రాజ్ లెక్కల ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయి కుషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అఫీషియల్ టీజర్‌ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్, డైరెక్టర్ జి. నాగేశ్వర్ రెడ్డి గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు సి. కళ్యాణ్, దామోదర్ ప్రసాద్, రామసత్య నారాయణ మరియు దర్శకులు దశరథ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ వేడుకలో దర్శకుడు ధన్ రాజ్ లెక్కల మాట్లాడుతూ “నేను పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిని. సాధారణంగా ఆయన ప్రతి సినిమాలో ఇంట్రో సాంగ్‌లో మూడు నిమిషాల పాటు సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తారు. నేను అదే పాయింట్ ఇన్స్పిరేషన్గా తీసుకుని.. మా ఊర్లో ఉండే ఒక ఐదుగురు పవన్ ఫ్యాన్స్ ఏం చేశారు? అనే కథతో, రైతుల సమస్యల చుట్టూ ఈ మూడు గంటల సినిమాను అద్భుతంగా రాసుకున్నాను. రైతుల గురించి ఆలోచించే ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు. ఈ పల్లెటూరి డ్రామా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.
Also Read
- Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
- Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
- Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
- Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
తాజావార్తలు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్‌పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్‌కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్‌పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!