Hey Chikitha: ‘రైతే రాజు’ కాన్సెప్ట్‌తో ‘హే చికీతా’..క్లైమాక్స్ చూస్తే కంటతడి ఖాయం..

Hey Chikitha

Hey Chikitha

అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ప్రముఖ టెక్నీషియన్ ‘గరుడవేగ’ అంజి సంయుక్తంగా నిర్మించిన సరికొత్త చిత్రం ‘హే చికీతా’. ధనరాజ్ లెక్కల దర్శకత్వంలో అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ జూలై 24న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్‌తో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం.. తాజాగా ట్రైలర్ లాంచ్ ప్రొగ్రామ్‌తో పాటు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరుపుకుంది. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, కమెడియన్ అలీ, వీఎన్ ఆదిత్య, ప్రసన్న కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ ఈవెంట్‌లో దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. “నేను ఆల్రెడీ ‘హే చికీతా’ మూవీని చూశా, ఫస్ట్ హాఫ్ అంతా ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు. సెకండాఫ్ అంతా విపరీతమైన ఎమోషన్‌తో సాగుతుంది, ముఖ్యంగా క్లైమాక్స్ చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకుంటారు. అభినవ్, దివిజ, తన్మయ్ అద్భుతంగా నటించారు, ఇందులో ఒక గొప్ప సందేశం ఉంది” అని పేర్కొన్నారు. నటుడు దేవి ప్రసాద్ మాట్లాడుతూ.. ఒక కూతురు తండ్రి వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్లే సీన్ మరియు అందులో చైల్డ్ ఆర్టిస్ట్ యోధ నటన చూసి తనకు గూస్ బంప్స్ వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు.

కమెడియన్ అలీ మాట్లాడుతూ.. భవిష్యత్తులో రైతు అనేవాడు ఉంటాడా అనే భయం వేస్తున్న తరుణంలో, రైతు ఉంటేనే దేశం నిలబడుతుందనే నిజంతో, యువతను ఇన్వాల్వ్ చేస్తూ తీసిన ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలన్నారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ సైతం సినిమా పోస్టర్ చూస్తే తమ ఊరి రోజులు గుర్తుకొచ్చాయని, పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ ‘రైతే రాజు’ కాన్సెప్ట్ విజయవంతం కావాలని కోరుకున్నారు. హీరోయిన్ దివిజ ఇందులో ‘చిట్టి’ అనే పాత్రలో, తన్మయ్ ఖుషి ‘పొట్టి’ అనే బావను పిచ్చిగా ప్రేమించే పాత్రలో కనిపించనున్నారు.