రాధిక ఆ పేరు వింటేనే కుర్రాళ్లకు భయం. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన హీరోయిన్ నేహా శెట్టి. ఈ కన్నడ కస్తూరీ డీజే టిల్లు సినిమాతో పాపులరై విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకుంది. కానీ ఆ తర్వాత బెదురులంక, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిల్లో పాజిటివ్ క్యారెక్టర్స్ చేసినా హిట్ పడలేదు. అంతలా ఆమె కెరీర్‌పై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది హీరోను చీట్ చేసే క్యారెక్టర్. మళ్లీ టిల్లు స్క్వేర్‌లో మెరిసిన పెద్దగా యూజయ్యిందీ లేదు. గ్యాంగ్ ఆఫ్ గోదావరి తర్వాత కొత్త సినిమాకు కమిటైన దాఖలాలు లేవు కానీ మొన్న ఓజీలో కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ అంటూ ఐటమ్ సాంగ్ లో చిందులేసింది.
Also Read : BadBoyKarthik : నాగ శౌర్య.. బ్యాడ్ బాయ్ కార్తీక్ టీజర్ రిలీజ్.. ఇలాంటి సినిమాలు అవసరమా
గుండెల మీద కొట్టాలంటే మా అమ్మాయిల కంటే గట్టిగా కొట్టేవారు ఎవరూ లేరు అంటూ బేబిలో వైష్ణవి చైతన్య చెప్పిన డైలాగ్ సినిమాలో తన క్యారెక్టర్ నెగెటివ్‌గా రిప్రజెంట్ చేస్తోంది. బేబిలో హీరోయిన్ అయినా, అనుకోని పరిస్థితుల్లో ప్రియుడ్ని మోసం చేసే ప్రియురాలిగా కనిపించి నెగెటివిటీ మూట గట్టుకుంది. ఈ సినిమా ఆమె కెరీర్‌నీ ఎక్కడికో తీసుకెళ్లిపోతుందని ఊహించారు. కట్ చేస్తే మేడమ్ చేతిలో ప్రెజెంట్ ఒకే ఒక్క ఫిల్మ్ మాత్రమే ఉంది. నేహా, వైష్ణవి కన్నా ముందే నెగిటివ్ షేడ్‌లో కనిపించిన గ్లామరస్ డాల్ పాయల్ రాజ్ పుత్ కూడా కెరీర్ అంతగా గొప్పగా ఏం లేదు. ఆర్ఎక్స్ 100లో ఆమె విలనీ విశ్వరూపం చూసి యూత్ షాకయ్యారు. ఆ తర్వాత కూడా ఇలాంటి రోల్సే వస్తున్నాయని పలు మార్లు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది పాయల్. వెంకీ మామ, డిస్కో రాజా, మంగళవారం మినహా పెద్దగా హిట్స్ పడలేదు. బోలెడ్ సినిమాలు చేసినా కెరీర్ పరంగా ఇప్పటికీ స్ట్రగుల్ ఫేస్ చేస్తోంది పాయల్. ప్రజెంట్ తెలుగులో కిరాతక మాత్రమే ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్. పేరుకు హీరోయిన్సే అయినా రిస్క్ అని తెలిసి కూడా నెగిటివ్ షేడ్స్ చేసి కెరీర్‌ను సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే ఉన్నారు.