ప్రజంట్ ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఎక్కువైపోయింది. సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు అనిరుధ్ ఇంకా రెహమాన్ మధ్య వార్ మొదలైంది. గత కొంత కాలంగా ఏఆర్ రెహమాన్ రెంజ్ సంగీతం కొత్త సినిమాల్లో వినిపించడం లేదన్నది వాస్తవం. కెరీర్ ఆరంభంలో రోజా, బొంబాయి, ప్రేమికుడు లాంటి బ్లాక్ బస్టర్స్ లెక్కలేనన్ని ఇచ్చిన ఈ లెజెండరీ మ్యుజిషియన్ ఇప్పుడు 58 వయసులో డీసెంట్ ట్రాక్స్ తప్ప బెస్ట్ ఇవ్వలేకపోతున్నారనేది చేదు నిజం. ‘పొన్నియిన్ సెల్వన్’ ‘ఛావా’ దీనికి ఉదాహరణ. ఈ రెండు సినిమాలు చూసిన ప్రేక్షకులు అసలు మ్యూజిక్ ఇచ్చింది రెహమాన్ ఏ నా? అని నిరుత్సహం వ్యాక్తం చేశారు. ఇక పెద్ది మూవీ టీజర్ వచ్చాక ఎన్నో టాపిక్స్ మీద చర్చ జరుగుతోంది.
Also Read : Surya : సూర్య – వెంకీ అట్లూరి సినిమా పై లేటెస్ట్ అప్ డేట్
తాజాగా విడుదలైన రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ టీజర్ బి జి ఎం లో వింటేజ్ రెహమాన్ కనిపించాడు. కానీ బుచ్చిబాబు ఒత్తిడి వల్లే ఇంత అవుట్ ఫుట్ వచ్చిందనే మాటలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు నాని ‘ది ప్యారడైజ్’ మూవీ కి సంగీత మిస్తున్న అనిరుధ్ రవిచందర్ భీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. తన ఏజ్ 34. ఇప్పటికే రజినీకాంత్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరికీ కెరీర్ బెస్ట్ సాంగ్స్ కంపోజ్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ రుజువు చేసుకోవాల్సింది రెహమనే కానీ అనిరుద్ కాదు అని సినీ ప్రియుల అభిప్రాయం. మరి బుచ్చిబాబు మూవీకి రెహమాన్ ఏ మాత్రం న్యాయం చేస్తారో చూడాలి. ముఖ్యంగా అనిరుధ్ తో పోటీ ఎలా ఇస్తారో చూడాలి.