Site icon NTV Telugu

శ్రీకారం : మోస్ట్ అవైటెడ్ సాంగ్ ‘అలిసిన సూపులలో’…!

Here's the most awaited Alisina Soopulalo lyrical from Sreekaram

యంగ్ హీరో శర్వానంద్ ఇటీవలే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శ్రీకారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఉప రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంతో బి కిషోర్ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. శర్వానంద్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాను 4 రీల్స్ సంస్థ నిర్మించింది. మహా శివరాత్రి కానుకగా మార్చ్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీకారం’ ఏప్రిల్ 16 నుంచి ప్రముఖ ఓటిటి సన్‌నెక్స్ట్‌ లో ప్రసారం అవుతోంది. ఒక సాఫ్ట్ వేర్ యువకుడు రైతుగా మారి, ఆధునిక వ్యవసాయం చేసి లాభాలు ఎలా గడించాడు అన్నదే సినిమా కథ. వ్యవసాయ ప్రధాన నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి మోస్ట్ అవైటెడ్ సాంగ్  ‘అలిసిన సూపులలో’ లిరికల్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. సానపాటి భరద్వాజ్ పాత్రుడు లిరిక్స్ అందించగా… మోహన్ భోగరాజు ఆలపించారు. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్న ఈ లిరికల్ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి. 

Exit mobile version