NANI : నాని ఫ్యాన్స్‌కు నిరాశ.. ‘బ్లడీ రోమియో’ వాయిదా.. ‘OG 2’పై సుజీత్ ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. శ్రీకాంత్ ఓదెల, సుజీత్, సీబీ చక్రవర్తి ఇలా సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు. ఈ లైనప్‌లో ఉన్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ యాక్షన్ ఫిలిం ‘బ్లడీ రోమియో‘ ఇప్పుడు వాయిదా పడేలా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం నాని నటిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ ‘ది పారడైజ్‘ షూటింగ్లో జరుగుతున్న డిలే అని తెలుస్తోంది.
శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న ‘ది పారడైజ్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ముందుగా ఈ సినిమాను 2026 సమ్మర్లోనే విడుదల చేయాలనుకున్నప్పటికీ క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని మేకర్స్ దీనిని 2026 ఆగస్టు 21కి వాయిదా వేశారు. ప్రస్తుతం నాని తన పూర్తి కాల్ షీట్స్ ఈ సినిమాకే కేటాయించాల్సి రావడంతో సుజీత్ దర్శకత్వంలో రావాల్సిన ‘బ్లడీ రోమియో’ షూటింగ్ స్టార్ట్ అవడానికి మరింత ఆలస్యమైంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది ఆఖరిలో లేదా 2027లోనే ‘బ్లడీ రోమియో’ పట్టాలెక్కే అవకాశం ఉంది. మరోవైపు ‘బ్లడీ రోమియో’ ఆలస్యం కావడంతో దర్శకుడు సుజీత్ ఈ సినిమాను పక్కన పెట్టేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘OG 2‘ స్క్రిప్ట్ పనులపై దృష్టి సారించారు. ‘OG’ హిట్ కావడంతో సీక్వెల్ కథను మరింత పకడ్బందీగా పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సుజీత్ ఈ స్క్రిప్ట్‌ను ఫైనలైజ్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడని నాని డేట్స్ దొరికినపుడు బ్లడీ రోమియో చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!