kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు కేవలం కర్ణాటకకే పరిమితమైన కన్నడ సినిమా సత్తా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుస్తోంది. ముఖ్యంగా ‘కేజీఎఫ్’, ‘కాంతార’ వంటి చిత్రాల తర్వాత కన్నడ హీరోల క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఈ క్రేజ్‌కు తగ్గట్టుగానే ఇప్పుడు అక్కడి స్టార్ హీరోలు భారీ స్థాయిలో పారితోషికాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్’ సిరీస్‌తో యశ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘టాక్సిక్‘ కోసం యశ్ సుమారు రూ. 50 నుండి 70 కోట్లు చార్జ్ చేశాడని టాక్. అంతేకాకుండా బాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’లో రావణాసురుడి పాత్ర పోషిస్తున్నందుకు గానూ యశ్ ఏకంగా రూ. 100 కోట్లదాకా తీసుకున్నది బాలీవుడ్ సమాచారం. ఒక కన్నడ హీరో ఈ స్థాయిలో పారితోషికం అందుకోవడం విశేషం.
‘కాంతార’ సినిమాతో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందారు. ‘కాంతార: చాప్టర్ 1’ కోసం దాదాపు రూ. 100 కోట్లు పారితోషికంగా పుచ్చుకుంటున్నారని సమాచారం. దీనికి తోడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో వస్తున్న ‘జై హనుమాన్‘ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్నందుకు గానూ రిషబ్ రూ. 80 కోట్లు తో పాటు కొంత లాభాలలో వాటా కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం కంటెంట్‌ను నమ్ముకుని సినిమాలు తీస్తూనే మార్కెట్ వాల్యూను పెంచుకుంటూ కన్నడ హీరోలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ల జాబితాలో చేరుతున్నారు. కన్నడ సినిమాల స్పాన్ పెరగడం, అక్కడి హీరోలకు ఇతర భాషల్లో కూడా మార్కెట్ ఉండడంతో హీరోలు అడిగినంత ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.
Also Read
తాజావార్తలు
-
Ganesh Immersion 2026: గణేశ్ నిమజ్జనంపై హైటెక్ నిఘా.. 10 వేల కెమెరాలు, డ్రోన్లు రెడీ.!
-
ECI: “ఆ వార్త నమ్మొద్దు”.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ యూపీ పర్యటన రద్దుపై ఈసీఐ క్లారిటీ..
-
Shehbaz-Rahman: యూఎన్‌లో షెహబాజ్ షరీఫ్-తారిఖ్ రెహమాన్ భేటీ.. భారత్ దృష్టి!
-
Zeno Smart Phone: Zeno ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. బడ్జెట్ రూ.9,649.. 6,000mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్..
-
Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!