NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నటసింహం బాలకృష్ణ మరియు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. NBK 111 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ సినిమాపై బజ్ ను మరింత పెంచుతుంది.
సాధారణంగా బాలయ్య సినిమాల్లో ఐటెం సాంగ్‌లకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అందుకు తగ్గట్టే ఇప్పుడు రాబోతున్న NBK 111లోను స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేసాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. వీరసింహ రెడ్డిలో ఐటం సాంగ్ ను చంద్రిక రవిని తీసుకొచ్చిన దర్శకుడు ఈసారి ఏకంగా బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీని దించుతున్నాడు. బాలీవుడ్ లో వచ్చిన ‘రాక్‌స్టార్’ హౌస్ ఫుల్ 5వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ఈ భామ ఇప్పుడు బాలయ్య సరసన ఆడిపాడేందుకు సిద్ధమైంది. ఈ మాస్ మసాలా పాటను ఈ శుక్రవారం నుండి హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో చిత్రీకరించనున్నారు. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఆయన వేసే పవర్‌ఫుల్ మాస్ స్టెప్స్‌కు నర్గీస్ ఫక్రీ గ్లామర్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర మోత మొగిపోవడం ఖాయం. బాలయ్య ఎనర్జీకి దీటుగా నర్గీస్ తన గ్లామర్‌తో ఈ పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకువెళ్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ అప్‌డేట్ విన్న నందమూరి అభిమానులు అప్పుడే సోషల్ మీడియాలో సంబరాలు మొదలుపెట్టారు.
Also Read
- Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
- October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
- Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
- Impure : పెళ్లి కూతురు 'కన్య' కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న 'ఇంప్యూర్'!
తాజావార్తలు
-
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
-
Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!