కె.వి.గుహన్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా మూవీ “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”. తాజాగా చిత్రం నుంచి థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ కొత్తగా ఓ పోస్టర్ యూ రిలీజ్ చేశారు. అందులో హీరో, హీరోయిన్ భయపడుతుండగా… మధ్యలో ఓ మాస్క్ ఉంది. ఇదంతా చూస్తుంటే ఈ సినిమా సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్ గా రూపొందినట్టు అన్పిస్తోంది. కాగా “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ” థీమ్ సాంగ్ ఆసక్తికరంగా ఉంది.
Read Also : “తగ్గేదే లే” అంటున్న ప్రియాంక… పిక్స్
ఆదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”… హూ వేర్ వై అనేది దాని అర్థం. ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో ప్రియదర్శి, వివా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను డాక్టర్ రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మిస్తున్నారు. రామంత్ర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. సైమన్ కె కింగ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేస్తారా ? లేదంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఓటిటి బాట పడుతుందా అనేది చూడాలి.