టాలీవుడ్ లో మరో జంట విడాకులు తీసుకునేందుకు సిద్దమవుతుందని సోషల్ మీడియాలో ఈవార్త చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ లోనే కాదు దాదాపు అన్ని భాషల సినీ ఇండ్రస్టీలో ఇప్పుడు డైవొర్స్ అనే వార్తలే హైలెట్ అవుతుంది. ఏ సెలబ్రిటీ ఎప్పుడు విడాకులు ప్రకటిస్తారో అనే విషయం ఎవరికీ అంతుచిక్కని విషయంగా మారుతోంది. చూడటానికి నవ్వుతూ అందరిముందు కనిపించి మరుసటిరోజే విడాకులు అంటూ ప్రకటిస్తున్నారు. దీంతో దేనికోసం విడాకుటు తీసుకుంటున్నారో అందరికి ప్రశ్నార్థకంగా మారుతోంది. కాగా ఇప్పటికే మన టాలీవుడ్ లో పలు జంటలు విడాకులు తీసుకుని ఎవరికి వారు జీవిస్తూ ఉండగా.. ఇప్పుడు మరో టాలీవుడ్ జంట విడాకులు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఆ జంట ఎవరంటే.. టాలీవుడ్ లో ఫేమస్ అయిన గాయనీ, గాయకులు శ్రావణ భార్గవి – హేమచంద్ర.
తెలుగులో హేమచంద్ర సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఫేమస్. అనేక సూపర్ హిట్ సాంగ్స్ అందించడమే కాక అనేకమందికి తన గాత్నాన్ని దానం చేశాడు హేమచంద్ర. ఇక శ్రావణ భార్గవి గురించి చెప్పాలంటే తెలుగులో అనేక సినిమాల్లో సింగర్ గా తన ప్రతిభను చాటుకుంది. వీరిద్దరిదీ ప్రేమంచి పెద్దలను ఒప్పించి 2013లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా 2016వ కుమార్తె శిఖర చంద్రిక పుట్టింది. మంచిగా సాగుతున్న జీవితంలో ఏం జరిగిందో తెలియదు కానీ విడాకులు తీసుకోబోతున్నారని గత కొద్ది రోజులుగా పలు వెబ్ సైట్స్, యూట్యాబ్ ఛానల్లలో వీరిపై కథనాలు బయటకు వస్తున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇతర పోస్టులను తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేస్తున్నహేమచంద్ర ఈ విషయం మీద స్పందించకపోవడంతో విడాకుల ప్రచారం నిజమేనేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయం పై సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చ రచ్చఅవుతోంది. మరికొంతమంది నెటిజన్ల అయితే ఏకంగా హేమచంద్ర, శ్రావణ భార్గవి సోషల్ మీడియా అకౌంట్స్ లోకి వెళ్లి వాళ్ళ పోస్టుల కింద నిజమోనా అంటూ కామెంట్లు పెడుతున్నా స్పందించక పోవడం గమనార్హం. ఇలాంటి వార్తలపై నిజమా అపద్దమో అనే విషయం మీద క్లారిటీ ఇవ్వాలని నెటిజన్లు కామెంట్ల రూపంలో కోరుకుంటున్నారు.
Netflix: 300 మంది ఉద్యోగులను తొలగించిన నెట్‌ఫ్లిక్స్.. కారణమేంటంటే?
