Netflix: 300 మంది ఉద్యోగులను తొలగించిన నెట్‌ఫ్లిక్స్.. కారణమేంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ స్ట్రీమింగ్ కంపెనీ 300 మంది ఉద్యోగులను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో 150 మందిని తొలగించిన నెట్‌ఫ్లిక్స్.. రెవెన్యూ తగ్గడం సాకుగా చూపుతూ ఈ నిర్ణయం తీసుకుంది. తమ వినియోగదారులలో గణనీయమైన తగ్గుదల వల్ల ఆదాయం కోల్పోవాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. తొలగించిన ఉద్యోగులంతా అమెరికా బేస్‌గా పని చేస్తున్నవారే కావడం గమనార్హం. భారీగా పెట్టుబడులు పెట్టి కొనసాగిస్తున్నపుడు సంస్థ అభివృద్ధి కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పదని కంపెనీ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. నెట్‌ఫ్లిక్స్ కోసం వారు చేసిన సేవకు కృతజ్ఞతలు తెలిపారు.
గురువారం నాటి తొలగింపులు నెట్‌ఫ్లిక్స్ వర్క్‌ఫోర్స్‌లో 3 శాతం మందిని ప్రభావితం చేశాయి, ఇందులో 11,000 మంది పూర్తి సమయం ఉద్యోగులు ఉన్నారు. తొలగింపులు కూడా ఎక్కువగా అమెరికాలోనే జరుగుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఏప్రిల్‌లో భారీ సబ్ స్క్రైబర్లను కోల్పోయింది. వాల్ స్ట్రీట్ లో నెట్‌ఫ్లిక్స్ మార్కెట్ క్యాప్ నుండి ఈ ఏడాది కంపెనీ స్టాక్ దాదాపు 70% క్షీణించింది. గత నెలలో, నెట్‌ఫ్లిక్స్ 150 మంది కార్మికులను తొలగించింది, ఆదాయ వృద్ధి మందగించడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు గత నెల చివరిలో, నెట్‌ఫ్లిక్స్ తన మార్కెటింగ్ శాఖ పునర్నిర్మాణంలో భాగంగా స్ట్రీమింగ్ సేవ కోసం చలనచిత్రాలు, టీవీ షోలను ప్రమోట్ చేసే వెబ్‌సైట్ ‘టుడమ్’లో అనేక మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించింది. 2022 మొదటి త్రైమాసికంలో 2 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ స్టాక్ 20 శాతం మేర పడిపోయిందని మేలో ఒక నివేదికలో పేర్కొంది.
Also Read
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
- Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
నెట్‌ఫ్లిక్స్ దాదాపు 221.6 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం. దీనిని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ద్రవ్యోల్బణానికి తోడు, రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం సంస్థపై ప్రభావం చూపిస్తోంది. సంస్థ కార్యకలాపాలు ప్రారంభించిన దశాబ్ద కాలంలో ఈ స్థాయిలో చందాదారులను కోల్పోవడం ఎప్పుడూ లేదు. దీంతో చందాదారులను ఆకర్షించేందుకు నెటిఫ్లిక్స్ వివిధ చౌక ప్లాన్లను తీసుకొచ్చేందుకు నిర్ణయించింది.
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి