NTV Telugu Site icon

HEMA : నేను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా రెడీ : హేమా

Untitled Design (5)

Untitled Design (5)

బెంగుళూరు రేవ్ పార్టీ కేస్  ఛార్జ్ షీట్ లో నటి హేమా పేరును చేర్చారు పోలీసులు.  హేమతో పాటు మరో  88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 1086 పేజీల ఛార్జ్ షీట్ లో హేమా పార్టీ లో పాల్గొని డ్రగ్స్ సేవించినట్టు పేర్కొన్నారు. అందుకు సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ ను ఛార్జ్ షీట్ కు జోడించారు. పార్టీ నిర్వహించిన 9 మంది పై ఇతర సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. బెంగుళూరు రేవ్ పార్టీ ఛార్జ్ షీట్ పై స్పందించిన హేమా..

Ntv తో ఫోన్ లో మాట్లాడుతూ.. ‘నేను ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకోలేదు, బెంగళూరు పోలీసుల ఛార్జ్ షీట్ లో నా పేరు వచ్చినట్టు ఇప్పుడే  తెలిసింది. నేను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం, పోలీసుల చార్జ్ షీట్ నాకు వచ్చాక నేను దీనిపై స్పందిస్తాను, నాకు ఉన్న సమాచారం మేరకు డ్రగ్స్ రిపోర్ట్ లో నెగిటివ్ అని చార్జ్ షీట్ లో వేశారు. MDMA నేను డ్రగ్స్ తీసుకోలేదు. కొన్ని మీడియా సంస్థల వల్ల నా పేరు ఛార్జ్ షీట్ లో పెట్టారు” అని తెలిపింది హేమా.

Show comments