నార్త్ బెల్ట్‌లో గతేడాది హారర్ అండ్ హారర్ కామెడీస్ సత్తా చాటాయి. స్తీ2, ముంజ్య, సైతాన్, భూల్ భూలయ్యా3 మంచి విజయాలను నమోదు చేశాయి. కానీ ఈ ఇయర్ ఎందుకో పేలవంగా మారాయి. కాజోల్ ‘మా’తో పాటు ద భూత్నీ ఎప్పుడొచ్చాయో ఎప్పుడు వెళ్ళాయో కూడా తెలియలేదు. అయితే హారర్ కామెడీ అంటే బ్రాండ్‌గా మారిన మడాక్ ఫిల్మ్స్ ఆ లోటు థమతో తీర్చేందుకు ట్రై చేస్తోంది. మడాక్ హారర్ కామెడీ యూనివర్శ్‌లో ఫిప్త్ ఇన్ స్టాల్ మెంట్ మూవీగా వస్తున్న థమ అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ముంజ్య ఫేం ఆదిత్య సర్పోత్థర్ దర్శకుడు. సికిందర్ ప్లాప్ తర్వాత నేషనల్ క్రష్ నుండి వస్తోన్న బాలీవుడ్ ఫిల్మ్ ఇదే. ఈ సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టింది మడాక్ ఫిల్మ్స్.
Also Read : Raashii Khanna : రాశీ ఖన్నా ఖాతాలో మరో మెగా హీరో..?
బాలీవుడ్ ప్రేక్షకులు ఈ ఏడాది హిస్టారికల్ డ్రామా తర్వాత కాస్తో కూస్తో ఆడియన్స్ కనెక్ట్ అయ్యారంటే అవి రొమాంటిక్ లవ్ స్టోరీలకే. సైయారాకు బ్లాక్ బస్టర్ హిట్టిచ్చిన బీ టౌన్ ఆడియన్స్. గతంలో ప్లాపైన రొమాంటిక్ స్టోరీ ‘సనమ్ తేరీ కసమ్’ను ఈ ఏడాది రీ రిలీజ్ చేస్తే సూపర్ హిట్ చేశారు. ఈ సినిమా ఇచ్చిన స్పూర్తితో హర్షవర్థన్ రాణే మరో సారి రొమాంటిక్ డ్రామా ‘ఏక్ దీవానేకి దీవానియాత్’ తో థమకు పోటీగా అక్టోబర్ 21నే దిగబోతున్నాడు. థమతో హిట్ కొట్టాలని గట్టింగా కోరుకుంతుంది రష్మీక. అందుకోసం అందాలు కూడా ఆరబోసింది. మరి నార్త్ ఆడియన్స్ ఈ దీవాళికి ఎవరి ఖాతాలో హిట్టాస్తారే చూడాలి.