దేశ రాజధాని ఢిల్లీలో నిత్యం బిజీ జీవనం గడుపుతున్న తెలుగు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు వివిధ రంగాల్లో విధులు నిర్వహిస్తున్న తెలుగు వారి కోసం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు ప్రదర్శిస్తున్నారు. ఈ పాన్-ఇండియా చిత్రం జూలై 24, 2025న విడుదలై, భారీ ఓపెనింగ్స్‌తో పాటు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలను అందుకుంది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలో స్థిరపడిన తెలుగు వారికి ఈ సినిమాను చేరువ చేసేందుకు ఈ ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
Also Read:Samantha : ఆ పచ్చబొట్టు అలాగే ఉంచుకున్న సమంత..
వారాంతపు సెలవు దినాలైన శనివారం, ఆదివారం (జూలై 26, 27) రోజుల్లో ఏపీ భవన్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆడిటోరియంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ ఈ విషయాన్ని ప్రకటిస్తూ, రెండు రోజుల్లో రెండు షోలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న తెలుగు అధికారులు, ఉద్యోగులు మరియు ఢిల్లీలో నివసిస్తున్న తెలుగు కుటుంబాల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటైంది. శనివారం (జూలై 26) రాత్రి 7 గంటలకు జరిగిన మొదటి షోకు ప్రేక్షకులు బారీ సంఖ్యలో హాజరై, ఆడిటోరియం పూర్తిగా నిండిపోయింది. క్రిష్ జాగర్లమూడి , జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, ఎంఎం కీరవాణి సంగీతం, జ్ఞానశేఖర్ మరియు మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
