హరిహర వీరమల్లు సినిమా దర్శకుడు జ్యోతి కృష్ణ ఆ సినిమాలో త్రివిక్రమ్ ప్రమేయం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. నిజానికి సినిమా ఆగిపోయిన తర్వాత మళ్లీ సినిమా మొదలు పెట్టాల్సిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారని, తనకు త్రివిక్రమ్‌తో టచ్‌లో ఉండాలని చెప్పారని అన్నారు. తాను అనుకున్న లైన్ తీసుకువెళ్లి త్రివిక్రమ్‌కి చెప్పగా అది ఆయనకు నచ్చిందని, వెంటనే పవన్ కళ్యాణ్‌కి జ్యోతి కృష్ణ రెడీగా ఉన్నాడు, సినిమా చేయవచ్చని చెప్పినట్లు వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌కు త్రివిక్రమ్ అత్యంత సన్నిహితమైన స్నేహితుడని, ఆయన షూటింగ్‌కు కూడా హాజరయ్యే వాళ్లని చెప్పుకొచ్చారు.
Also Read : Chiranjeevi : చిరంజీవి మధ్యవర్తిత్వం.. రేపు కార్మికులతో సమావేశం?
అంతేకాక థాంక్స్ కార్డ్స్‌లో హైపర్ ఆదికి థాంక్స్ వేయడం గురించి కూడా ఆయన స్పందించారు. ఈ సినిమాలో హైపర్ ఆదిని కూడా వాడుకున్నామని అన్నారు. తాను రూల్స్ వైన్యం సినిమా చేసినప్పుడు హైపర్ ఆదితో పరిచయం ఏర్పడిందని, ఈ సినిమాలో నక్క, పవన్ కళ్యాణ్ మాట్లాడే సీన్ హైపర్ ఆది రాసిందేనని అన్నారు. అక్కడ కాస్త కామెడీ ఉంటే బాగుంటుందని అనుకున్నానని, ఈ నేపథ్యంలోనే ఆ సీన్ రాసుకున్నట్లుగా వెల్లడించారు. ఆ సీన్‌కి హైపర్ ఆది డైలాగ్స్ అందించారని, కాస్త తెలంగాణ యాస కూడా పాడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో చాలామంది కాంట్రిబ్యూషన్ ఉందని, వారందరికీ థాంక్స్ కార్డ్స్ వేసామని ఆయన అన్నారు.
