హరిహర వీరమల్లు సినిమా విడుదలై మిక్స్‌డ్ టాక్ సంపాదించింది. పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని క్రిష్ డైరెక్షన్‌లో మొదలుపెట్టారు. అయితే సినిమా వాయిదాలు పడుతూ వస్తున్న నేపథ్యంలో క్రిష్ తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తలకెత్తుకొని సినిమా పూర్తి చేశారు. ఎట్టకేలకు ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్‌లో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Also Read:Pawan Kalyan: పంచాయతీలు చేసి వీరమల్లు రిలీజ్ చేయాల్సి వస్తుందని అనుకోలేదు!
హరిహర వీరమల్లు రిజల్ట్ నేపథ్యంలోనే సెకండ్ పార్ట్ చేయాలా వద్దా అనే ఉద్దేశంలో ఉన్నారని నిర్మాత రత్నం సహా పవన్ కళ్యాణ్ కూడా గతంలో ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఆయన మాట్లాడుతూ సినిమాలో జయసుధ కుమారుడు ఒక కీలక పాత్రలో నటించాడని, ఆ పాత్ర గురించి మాట్లాడుతూ ఆ పాత్రకు సంబంధించి సెకండ్ పార్ట్‌లో ఇంకా డీటెయిల్ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే సెకండ్ పార్ట్‌కి సంబంధించి 30% షూటింగ్ పూర్తయిందని, మిగతా షూటింగ్ కూడా పూర్తి అయిన తర్వాత సినిమా విడుదల కావాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో ఈ సినిమా సెకండ్ పార్ట్ ఉంటుందా ఉండదా అనే ప్రచారాల నేపథ్యంలో వాటన్నింటికీ బ్రేకులు వేసినట్లు ఉంది.
