Happy Raj : హాపీ రాజ్ కోసం రౌడీ బాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసక్తికరమైన టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి సినీ వర్గాల్లో చర్చల్లో నిలుస్తున్న చిత్రం ‘హ్యాపీ రాజ్’. ప్రమోషన్స్ పరంగా వినూత్నంగా వెళ్తున్న చిత్ర యూనిట్ తాజాగా అధికారిక ప్రోమో విడుదల చేసింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదలైన తెలుగు ప్రోమో.. సినిమా స్టోరీ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పేసింది. డిఫరెంట్ స్టైల్ మేకింగ్ తో విడుదలైన కొద్ది సమయంలోనే సోషల్ మీడియా వేదికలో ఈ వీడియో వైరల్ అయింది. జయవర్ధన్ నిర్మిస్తున్న ఈ చిత్రం, బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఫీల్-గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మారియా ఎలాంచెజియన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో కనిపించే ప్రతి ఫ్రేమ్ కూడా వైవిధ్యంతో కూడి ఉండి ఆకర్షిస్తోంది.
Also Read:Cheekatilo Review: చీకటిలో రివ్యూ.. పెళ్ళయ్యాక శోభిత మొదటి సినిమా ఎలా ఉందంటే?
Also Read
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
- Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. 'ఇరుముడి' టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
- Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. 'ఈటీవీ విన్'లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
ఈ సినిమాలో జీవీ ప్రకాశ్ కుమార్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. రిఫ్రెషింగ్ విజువల్స్, లైట్ హ్యూమర్, హాయిగా సాగే టోన్‌తో ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అనుభూతిని అందించబోతోందనే నమ్మకాన్ని ప్రోమో బలంగా కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ రోజుల్లో అవసరమైన హ్యాపీనెస్‌ను అందించే సినిమాగా ఇది నిలవబోతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంలో జీవీ ప్రకాశ్ కుమార్ టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. శ్రీ గౌరి ప్రియా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, చాలా కాలం తర్వాత అబ్బాస్ మళ్ళీ సినిమాల్లోకి తిరిగి రావడం విశేషంగా మారింది. ఇకపోతే ఈ చిత్రంలో జార్జ్ మరియం, ప్రార్థనా, అధిర్చి అరుణ్, మదురై ముత్తు, సోఫా బాయ్ రసూల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను మారియా ఎలాంచెజియన్ నిర్వర్తించగా.. జైకాంత్ సురేష్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మధన్ క్రిస్టఫర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చుతున్నారు. ఆర్‌కే సెల్వా ఎడిటింగ్, కుమార్ గంగప్ప ఆర్ట్ డైరెక్షన్, ప్రవీణ్ రాజా కాస్ట్యూమ్స్ బాధ్యతలు చేపట్టారు. మొత్తంగా, ప్రోమోతోనే మంచి అంచనాలను క్రియేట్ చేసిన ‘హ్యాపీ రాజ్’, ఓ కంప్లీట్ ఫీల్-గుడ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర బృందం చెబుతోంది.
తాజావార్తలు
-
Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
-
UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!