Teja Sajja Engagement : తేజ సజ్జా కాబోయే భార్యను చూశారా?

Teja Sajja Engagement

Teja Sajja Engagement

టాలీవుడ్ యువ సెన్సేషన్, ‘హను-మాన్’ సినిమాతో ప్యాన్ ఇండియా స్థాయిలో రికార్డులు కొల్లగొట్టిన మన సూపర్ హీరో తేజ సజ్జా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కేవలం రెండు, మూడు సినిమాలతో స్టార్ డమ్ తెచ్చుకున్న ఒక యువ హీరో ఎంగేజ్‌మెంట్‌కి ఏకంగా మెగాస్టార్ తో పాటు రాష్ట్ర గవర్నర్, కేంద్ర మంత్రులు క్యూ కట్టడం ఇప్పుడు ఫిలిం నగర్ నుంచి పొలిటికల్ సర్కిల్స్ వరకు హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లో ఉన్న ప్రముఖ హోటల్ ‘తాజ్ కృష్ణ’ వేదికగా తేజ సజ్జా, మౌర్యల నిశ్చితార్థం అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఎంతో ప్రైవేట్ గా ఈ వేడుకను ప్లాన్ చేసినప్పటికీ.. వచ్చిన గెస్ట్ లతో ఆ ప్రాంతమంతా ఓ రేంజ్ లో కోలాహలంగా మారిపోయింది.

ముఖ్యంగా ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పటి నుంచే తేజకు చిరంజీవితో ఉన్న ఆత్మీయ అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. తన ముద్దుబిడ్డ లాంటి తేజ ఎంగేజ్మెంట్ కి చిరు స్వయంగా విచ్చేసి సందడి చేశారు. ఇక రాజకీయ ప్రముఖుల విషయానికొస్తే.. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి లాంటి అగ్రశ్రేణి నాయకులు స్వయంగా వచ్చి కాబోయే వధూవరులను దీవించడం తేజ సజ్జాకున్న నెట్ వర్క్, క్రేజ్ ఎలాంటిదో స్పష్టం చేస్తోంది.

వీరితో పాటే పలువురు రాష్ట్ర మంత్రులు, టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు, స్టార్ డైరెక్టర్లు, తోటి హీరోలు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. ఒకవైపు టాలీవుడ్ గ్లామర్, మరోవైపు పొలిటికల్ పవర్.. ఈ రెండింటి కలయికతో తేజ సజ్జా ఎంగేజ్మెంట్ ఒక సెన్సేషనల్ ఈవెంట్ గా మారిపోయింది. వెండితెరపై తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న తేజ సజ్జా.. ఇప్పుడు మౌర్యతో కలిసి జీవితంలో కొత్త అంకానికి శ్రీకారం చుడుతున్నాడు. ఈ అందమైన జంటకు జీవితాంతం ప్రేమ, సంతోషాలు దక్కాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా (#TejaSajjaEngagement) శుభాకాంక్షలు వెల్లువలా కురిపిస్తున్నారు.