Site icon NTV Telugu

Producer Niranjan Reddy- Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ తో నిరంజన్ సాహసం..!

Sai Dharam Tej

Sai Dharam Tej

Producer Niranjan Reddy- Sai Dharam Tej: మెగాస్టార్ మేనల్లుడుగా చిత్ర సీమలోకి అడుగుపెట్టాడు సాయిధరమ్ తేజ్.. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రేయ్ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాడు. కానీ, ఆ చిత్రం బాక్సఫీస్ దగ్గర ప్లాప్ గా నిలిచింది. పిల్లా నువ్వులేని జీవితంతో మొదటి హిట్ దక్కించుకున్నాడు సాయి.. తర్వాత వరుస హిట్లతో దూసుకెళ్తూ సుప్రీం స్టార్ గా ఎదిగాడు.. కానీ, ఆ తర్వాత తిక్క, విన్నర్, ఇంటిలిజెంట్ లాంటి సినిమాలతో వరుస ప్లాప్ పలకరించాయి. కొన్నాళ్ల కిత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సినిమాలకు దూరం అయ్యాడు సాయి.. ప్రమాదం నుంచి కోలుకుని విరూపాక్ష సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా విజయంతో కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించాడు. కాగా, అదే ఏడాది వచ్చిన బ్రో చిత్రం యావరేజ్ గా నిలిచింది.

Read Also: GHMC Council Meeting: మేయర్ పోడియంను చుట్టుముట్టిన బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు..

అయితే, సాయిధరమ్ తేజ్ సినీ కెరీర్ లో 18వ సినిమా చేయబోతున్నాడు.. ఇటీవల హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. కానీ ఈ చిత్ర బడ్జెట్ లెక్కలు సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాయిధరమ్ తేజ్ తో సినిమాకు అక్షరాలా రూ. 125 కోట్ల బడ్జెట్ ను కేటాయించాడట నిర్మాత నిరంజన్ రెడ్డి. సాయితో ఇంత బడ్జెట్ అంటే రిస్క్ అని ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఈ హీరో కెరీర్ హయ్యెస్ట్ కలెక్షన్స్ అటు ఇటుగా రూ.90 కోట్ల గ్రాస్.

Read Also: Crime Thriller Kidnap : తనకు తానే కిడ్నప్ అయినట్లు సృష్టించి తల్లితండ్రుల నుండి 2 లక్షలు డిమాండ్..

ఇక, సాలిడ్ గా ఒక్క వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సినిమా లేదని అలాంటిది సాయితేజ్ మీద రూ.125 కోట్ల ఖర్చుపెట్టడం.. అది కూడా ఒక కొత్త దర్శకుడితో పెద్ద రిస్క్ అనే చెప్పాలి.. కానీ తాను కథను నమ్ముతానని కథ డిమాండ్ చేస్తే ఎంత ఖర్చైన పెడతానని హనుమాన్ చిత్రం అలాగే నిర్మించానని ఆ చిత్రం తన నమ్మకాన్ని నిలబెట్టిందని సాయితో సినిమాను భారీ బడ్జెట్ లో తెరకెక్కినని నిర్మాత నిరంజన్ రెడ్డి అన్నట్టు వార్తలు వస్తున్నాయి.

Exit mobile version