జగపతి బాబు చేతుల మీదుగా `ఛలో ప్రేమిద్దాం` ఫస్ట్ సింగిల్ లాంచ్
జగపతి బాబు చేతుల మీదుగా ఛలో ప్రేమిద్దాం ఫస్ట్ సింగిల్ లాంచ్
హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ నిర్మిస్తోన్న చిత్రం ఛలో ప్రేమిద్దాం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ఈ రోజు విభిన్న నటుడు జగపతి బాబు లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకంక్షలు తెలిపారు.
ఎమ్బిఏ, ఎమ్‌సిఏలు చదవలేకపోతివి అంటూ సాగే ఈ కాలేజ్ సాంగ్ కు దేవ్ పవార్ అద్భతమైన సాహిత్యాన్ని సమకూర్చగా వెంకట్ దీప్ కొరియోగ్రఫీ అందించారు. ఆదిత్య ద్వారా ఆడియో మార్కెట్ లోకి విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ…ఈ రోజు జగపతి బాబు గారి చేతుల మీదుగా మా చిత్రంలోని ఫస్ట్ సాంగ్ లాంచ్ చేశాం. ఈ సందర్భంగా ఆయనకు చాలా థ్యాంక్స్. ఇక ప్రస్తుతం మా సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
డైరక్టర్ సురేష్ శేఖర్ రేపల్లే మాట్లాడుతూ…ఇటీవల విడుదలైన మా చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
Also Read
ఇక ఈ రోజు మా చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ను జగపతి బాబు గారు లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.ఎమ్బిఏ, ఎమ్‌సిఏలు చదవలేకపోతివి` అనే పల్లవితో ప్రారంభమయ్యే ఈ కాలేజ్ సాంగ్ యూత్ తో పాటు ప్రతి ఒక్కకరికీ కనెక్టయ్యే విధంగా భీమ్స్ కంపోజ్ చేయగా దేవ్ పవార్ ట్రెండీగా రాశారు. వెంకట్ దీప్ మ్యూజిక్ కి తగ్గట్టుగా డిఫరెంట్ స్టెప్స్ తో సాంగ్ ను కొరియోగ్రఫీ చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలైన మా సాంగ్ అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది. వరుసగా ఒక్కో సింగిల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం. అతి త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాంఅన్నారు.
హీరో సాయి రోనక్ మాట్లాడుతూ...జగపతి బాబు గారు మా మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడం హ్యాపీ. సినిమాలో వచ్చే ఫస్ట్ సాంగ్ ఇది. చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది. భీమ్స్ గారు వండ్రఫుల్ కంపోజ్ చేశారు. వెంకట్ మాస్టర్ స్టెప్స్ కూడా కొత్తగా ట్రై చేశారు. అందరికీ సాంగ్ నచ్చుతుందని ఆశిస్తున్నాంఅన్నారు. నటుడు ఆర్.కె. మాట్లాడుతూ... దర్శకుడు సురేష్ నాకు మంచి మిత్రుడు. ఈ సినిమాలో నేను ఒక మంచి రోల్ చేశాను. ఈ రోజు ఒక యూత్ ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది. అందరూ విని సాంగ్ ని మంచి సక్సె స్ చేయాలన్నారు.
తాజావార్తలు
-
Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
-
Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కెప్టెన్..
-
Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !
-
Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్‌లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్
-
Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో