NTV Telugu Site icon

Ram Charan: క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరణే.. అరుదైన గౌరవం

Ram Charan Madam Tussads

Ram Charan Madam Tussads

స్టార్‌ హీరో రామ్‌చరణ్ అరుదైన ఘనత సాధించారు. ఇండియా సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగానూ సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అయింది. అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. చరణ్‌ మైనపు విగ్రహానికి సంబంధించిన కొలతలను మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం ప్రతినిధులు తీసుకున్నారు, మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే రామ్ చరణ్ పెంపుడు కుక్క రైమ్ ను కూడా రామ్ చరణ్ తో పాటు మైనపు విగ్రహం చేయించనున్నారు.

SSMB 29: ఇదేంట్రా ఇది.. జక్కన్నకే ట్రైనింగా?.. ఇక సినిమా మీ ఊహకే వదిలేస్తున్నాం

క్వీన్ ఎలిజబెత్ II తరువాత ఒక పెంపుడు జంతువు మైనపు విగ్రహం పెట్టించే ఏకైక సెలబ్రిటీగా చరణ్ నిలవనున్నారు. ఇక ఈ స్పెషల్ ఎక్స్‌పీరియన్స్‌లో రైమ్ నాతో చేరడం నాకు చాలా ఆనందంగా ఉంది అని చరణ్ పంచుకున్నాడు. రైమ్ నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అని అన్నారు. ఇక 2025 వేసవి సమయానికి చరణ్‌ విగ్రహాన్ని సందర్శన కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఉన్న ‘ఐఐఎఫ్‌ఏ జోన్‌’లో ఇప్పటికే షారుక్‌, అమితాబ్‌ బచ్చన్‌, కాజోల్‌, కరణ్‌ జోహార్‌ల మైనపు విగ్రహాలు ఉన్నాయనే సాంగైట్ తెలిసిందే.