Site icon NTV Telugu

Suhas: అంబాజీపేట హీరోయిన్ తో మరో సినిమా

Suhas Shivani

Suhas Shivani

సుహాస్ సైలెంట్‌గా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇప్పటికే పలు హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఆయన, మరోసారి కొత్త సినిమాతో సిద్ధమవుతున్నాడు. తనతో కలిసి ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమాలో నటించిన శివాని హీరోయిన్‌గా నటిస్తున్న సరికొత్త సినిమా ఈ రోజు లాంచ్ అయింది.

Also Read:Ravi Teja 76: షూట్ మొదలెట్టిన రవితేజ

త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 2గా నరేంద్ర రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో కూడిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ సినిమా అని చెబుతున్నారు. ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాతో ప్రశంసలు అందుకున్న షణ్ముఖ ప్రశాంత్ ఈ సినిమాకు కథ అందించగా, గోపి అక్షర దర్శకుడిగా మారారు.

Also Read:The Raja Saab: ఒక్క సెట్.. ఎన్నో స్పెషాలిటీలు!

ఈ సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ లాంచ్ ఈవెంట్‌కు నాగశ్వరం, సత్యదేవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు సత్యదేవ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నాగశ్వరం క్లాప్ కొట్టారు. ఈ సినిమాలో నరేష్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నట్లు వెల్లడించారు. మహి రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, విప్లవ నైషధం ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది.

Exit mobile version