టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ఘాటీ. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ఘాటీ. గతంలో తనకు వేదం వంటి హిట్ ఇచ్చిన క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో లేటెస్ట్‌గా ‘ఘాటీ’ సినిమా చేస్తుంది అనుష్క. తమిళ నటుడు విక్రమ్ ప్రభు కీలక పాత్ర పోషిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికి ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్ విశేషంగా ఆకట్టుకుంది.
Also Read : Prashanth Neel : సలార్ – 2 ఉంటుందా.. ఉండదా.. క్లారిటీ ఇదే.!
అయితే మొదట ఈ సినిమాను ఏప్రిల్ 18న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసారు మేకర్స్. కానీ షూట్ డిలే కారణంగా కీలకమైన సీన్స్ వర్క్ ఇంకా పెండింగ్ ఉండడంతో వాయిదా వేశారు మేకర్స్. ఆ విషయాన్నీ అధికారకంగా కూడా ప్రకటించారు. అయితే ఘాటీ లేటెస్ట్ రిలీజ్ డేట్ ఎప్పడూ అనేదానిపై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 5న రిలీజ్ చేయాలను భావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న సీజీ వర్క్స్ ఆగస్టు నాటికి ఫినిష్ అవుతాయని ఆ నేపథ్యంలోనే సెప్టెంబర్ రిలీజ్ అనుకుంటున్నారట మేకర్స్. ఒకవేళ అదే డేట్ ఫిక్స్ అయితే సెప్టెంబర్ లో యూవీ క్రియేషన్స్ నుండి రెండు సినిమాలు వస్తాయి. ఇప్పటికే మెగాస్టార్ విశ్వంభర సినిమా కూడా సెప్టెంబర్ రిలీజ్ కు రెడీ అయింది. ఇప్పుడు ఘాటీ కూడా సెప్టెంబర్ రిలీజ్ అనుకుంటున్నారు మేకర్స్. మరి ఘాటీ రిలీజ్ పై మెకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.