ఘాటీ విడుదలకు ఓ పట్టాన ముహూర్తం ఫిక్స్ కావడం లేదు. ఏప్రిల్ బరిలో దిగాల్సిన సినిమా జులైకి షిఫ్టైంది. జులై మంత్ గడిచిపోతున్నా ఎప్పుడొస్తుందో క్లారిటీ రావట్లేదు. ఇక నెక్స్ట్ చెప్పే డేట్ పక్కాగా ఫిక్స్ అనుకుంటేనే ఎనౌన్స్ చేయాలని చూస్తోంది టీం. అయితే సెప్టెంబర్ 5కి తీసుకురావాలని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి యోచిస్తున్నాడన్న టాక్ నడుస్తోంది. ఘాటీ టీం అంతా ఈ డేట్‌కు మొగ్గు చూపుతుందని సమాచారం.
Also Read:Pakistani Reporter: రిపోర్టింగ్ చేయి తప్పులేదు.. కానీ ఇంత అవసరం లేదుగా..!
ఇక వరుస సక్సెస్‌లతో జోరు మీదున్న రష్మిక నుండి వస్తోన్న అప్ కమింగ్ ఫిల్మ్ ద గర్ల్‌ఫ్రెండ్. ఉమెన్ సెంట్రిక్ చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు రాహుల్ రవీంద్రన్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకోగా, రీసెంట్‌గా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కాగా, ఈ బొమ్మను కూడా సెప్టెంబర్ 5కే తీసుకురావాలన్న యోచనలో ఉన్నారట మేకర్స్. ఇప్పటి వరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, ఈ డేట్ పై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే, సెప్టెంబర్ 25కి ఓజీ, అఖండ 2 లేదా చిరు విశ్వంభర ఫిక్సైతే, స్పేస్ ఉండాలన్న ఉద్దేశంతో సుమారు మూడు వారాల గ్యాప్ తీసుకోవాలన్నది లేటెస్ట్ బజ్.
Also Read: Nara Lokesh: ఒకటవ తరగతి చిచ్చరపిడుగును మెచ్చుకున్న నారా లోకేష్.. ఇంతకీ ఏం చేసింది..?
ఘాటీ, ద గర్ల్‌ఫ్రెండ్ అదే టైంకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటే, యంగ్ హీరో తేజా సజ్జాతో పోటీపడాల్సి వస్తుంది. ఇప్పటికే మిరాయ్ పలుమార్లు వాయిదా పడి, సెప్టెంబర్ 5కి షిఫ్టైంది. వీటికి తోడు మదరాసి కూడా అదే రోజు వస్తున్నట్లు ఎనౌన్స్ చేసింద. అయితే మిరాయ్ డిలే అయ్యే ఛాన్స్ ఉందని టాక్. సో ఈ ఛాన్స్ మిస్ కాకూడదని అనుకుంటున్నారట అనుష్క, రష్మిక. రాజా సాబ్‌ని డీల్ చేస్తోన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్ కోసం ఆ డేట్ ఇవ్వనుందని టాక్. మరి ఈ పరిణామాలు చూస్తుంటే క్రష్మిక, అరుంధతి మధ్య వార్ తప్పేట్టు లేదు? మరి భామలు ఆ డేట్‌కే వస్తారా? లేక సెపరేట్ టైం చూజ్ చేసుకుంటారా? రిలీజ్ తేదీలను చెప్పేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
