Getup Srinu: “తొక్కలో ఇంటర్వ్యూ.. ఆపేయ్”.. మైక్ తీసి పారేసిన గెటప్ శ్రీను! అసలేం జరిగిందంటే..
- క్యాస్ట్ విషయంలో జాఫర్- గెటప్ శ్రీను వాగ్వాదం
- ఇంటర్వ్యూ మధ్యలోనే వెళ్లిపోయిన గెటప్ శ్రీను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Getup Srinu: ప్రముఖ నటుడు గెటప్ శ్రీను, జర్నలిస్ట్ జాఫర్ మధ్య జరిగిన మాటల యుద్ధం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక వ్యక్తిగత ఇంటర్వ్యూలో భాగంగా కులం ప్రస్తావన రావడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అసహనానికి లోనైన గెటప్ శ్రీను ఇంటర్వ్యూను మధ్యలోనే నిలిపివేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారని సమాచారం. అసలు ఏం జరిగిందంటే.. మహదేవపట్నంలో జరిగిన ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్ సరదాగా సాగినా.. కొద్ది సేపటికే ఉద్రిక్తతకు దారితీసింది. ఒకానొక సందర్భంలో కులం ప్రస్తావన రావడంతో ఒక్కసారిగా వేడెక్కింది. శ్రీను ఏదో సందర్భంలో స్పందిస్తూ “మేము కాపులం” అని వ్యాఖ్యానించగా.. దానిపై జాఫర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. “అలా మాట్లాడకూడదు” అని జాఫర్ అనడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.
పరిస్థితి విషమించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గెటప్ శ్రీను.. “ఈ తొక్కలో ఇంటర్వ్యూ నేను చేయను” అంటూ మైక్ తీసి పక్కన పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. శ్రీను వెళ్ళిపోయిన తర్వాత కూడా జాఫర్ స్పందిస్తూ.. “నేను ఏం తప్పుగా అడిగాను? ఎందుకు అంత సీరియస్ అవుతున్నారు?” అని ప్రశ్నించడం అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అసలు వివాదానికి దారితీసిన ఆ ప్రశ్న ఏంటి? వారి మధ్య అంతలా ఘర్షణ వాతావరణం నెలకొనడానికి కారణమేమిటనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి వీడియో బయటకు వస్తేనే అసలు నిజాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన చర్చ నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read
- Bloody Romeo: న్యాచురల్ స్టార్ నెక్స్ట్ లెవెల్ మేకోవర్.. లండన్‌లో ‘బ్లడీ రోమియో’ లొకేషన్ వేట మొదలుపెట్టిన సుజీత్!
- Actor Vishal : బొకేలు, శాలువాలు పక్కనబెట్టి కాలేజీ స్నేహితుల కలయిక
- Anil Ravipudi: ఆ రేర్ ఫీట్‌కు ఒక్క అడుగు దూరంలో అనిల్ రావిపూడి.. కింగ్‌తో క్రేజీ కాంబో ఫిక్స్?
- Peddi : ఇదెక్కడి ట్విస్ట్.. ఇప్పట్లో ఆగేలా లేదు?
తాజావార్తలు
-
Uddhav Thackeray: మరోసారి ముక్కలు కాబోతున్న శివసేన పార్టీ? కుప్పకూలుతున్న ఉద్ధవ్ సామ్రాజ్యం!
-
Sanchita Ugale: మరాఠీ నటి సంచితా ఉగలే మృతికి కారణమిదేనా? ఇంత జరిగిందా?
-
Nagpur: ఐఏఎఫ్ అధికారి భార్యపై అత్యాచారం, మతం మార్చుకోవాలని ఒత్తిడి.. సంచలనంగా నాగ్‌పూర్ వైరల్ వీడియో..
-
Bloody Romeo: న్యాచురల్ స్టార్ నెక్స్ట్ లెవెల్ మేకోవర్.. లండన్‌లో ‘బ్లడీ రోమియో’ లొకేషన్ వేట మొదలుపెట్టిన సుజీత్!
-
Uttar Pradesh: ఓవైసీతో పొత్తుకు కాంగ్రెస్ రెడీ..? యూపీలో కొత్త కూటమి..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?