టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి పరిచయం అక్కర్లేదు. రీసెంట్ గా ‘క’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ‘దిల్ రూబా’ మూవీతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా కొత్త దర్శకుడు విశ్వకరణ్ తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఇక అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు మేకర్స్ ఇస్తున్న ప్రతి అప్డేట్‌కి మంచి రెస్పాన్స్ రాగా, ఈ సినిమా పై ప్రేక్షకులో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. అయితే తాజాగా కిరణ్ తన ట్వీటర్ లో ఒక వీడియె వదిలాడు.
Also Read: Bollywood : బిపాసా దంపతుల పై సింగర్ షాకింగ్ కామెంట్స్..
ఎంటా వీడియో అంటే ఈ మూవీలో కిరణ్ అబ్బవరం వాడిన బైక్‌ని ప్రత్యేకంగా డిసైన్ చేయించారట. అయితే ‘ఈ మూవీ నుండి ఇప్పటి వరకు రిలీజైన టీజర్, ట్రైలర్,సాంగ్స్,ఈవెంట్ లల్లో మేము మాట్లాడిన మాటలల్లో..చాలా వరకు ఈ దిల్ రూబా లీక్ ఇచ్చాము. మీరు దాని గెస్ చేయండి. ఎవరు అయితే కరెక్ట్‌గా గెస్ చేస్తారో వారికి, ఈ బైక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో గిఫ్ట్‌గా ఇచ్చేస్తాను. అంతేకాదు ఈ బైక్ మీద ఎవరైతే గెలుచుకుంటారో వారితో.. దిల్ రూబా ఫస్ట్ డే ఫస్ట్ షో కలిసి వెళ్ళదాం’ అంటూ తెలిపాడు. మొత్తానికి ఈ సారి కిరణ్ ప్రమోషన్స్ కూడా గట్టిగా ప్లాన్ చేశారు.
Eee Bike Meede ❤️#Dilruba #DilrubaFromMarch14th pic.twitter.com/v1qpbMrsJU
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) March 2, 2025