Game Changer: గేమ్ ఛేంజర్ టీజర్ చూడాలా.. ఈ థియేటర్లలో మాత్రమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10, 2025న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. లక్నోలో ఈ మూవీ టీజర్‌ను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ సిటీలో ఇంత గ్రాండ్‌గా టీజర్ రిలీజ్ చేస్తోన్న తొలి పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ కావటం విశేషం. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో సిటీల్లో టీజర్ లాంచ్ కావటం సర్వసాధారణమైన విషయమే కానీ తొలిసారి ‘గేమ్ చేంజర్’ టీజర్‌ను నవంబర్ 9న లక్నో విడుదల చేస్తూ నిజంగానే టైటిల్‌కు తగ్గట్టు గేమ్‌ను చేంజ్ చేశారు. భారీ అంచనాలున్న గేమ్ చేంజర్ టీజర్ ఈవెంట్‌కు రామ్ చరణ్, కియారా అద్వానీ, డైరెక్టర్ శంకర్ సహా సినీ ప్రముఖులందరూ హాజరుకానున్నారు.
Kamal Haasan: పుట్టిన రోజు వేళ హీరో కమల్ హాసన్ ఇంటి ఎదుట ముస్లింల ధర్నా
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
అయితే లక్నో ప్రతిభ థియేటర్లో ఈ టీజర్ లాంచ్ చేయనుండగా మరో పది థియేటర్లలో కూడా ఈ టీజర్ ను లాంచ్ చేయనున్నారు. హైదరాబాద్ సుదర్శన్,వైజాగ్ సంగం, రాజమండ్రి శివజ్యోతి, విజయవాడ శైలజ, కర్నూల్ వీ మెగా, నెల్లూరు ఎస్ 2 థియేటర్, బెంగళూరు ఊర్వశి, అనంతపూర్ త్రివేణి, తిరుపతి పీజేఆర్, ఖమ్మం శ్రీ తిరుమల థియేటర్లలో టీజర్ చూడచ్చు. ఇక ఈ టీజర్ పై అంచనాలు నెక్ట్స్ రేంజ్‌లో ఉన్నాయి. అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనవరి 10న రిలీజ్ కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.యు.వెంకటేశన్, వివేక్ రైటర్స్‌గా వర్క్ చేశారు.
Let the games begin from Lucknow and spread like wild fire across India 💥🔥
Celebrate #GameChangerTeaser in 3 States and 11 theatres on Nov 9th, 4:30 PM onwards ✊🏼
In cinemas worldwide from Jan 10th.#GameChanger#GamechangerOnJAN10 🚁 pic.twitter.com/kJwoPRqV2V
— Game Changer (@GameChangerOffl) November 7, 2024
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!