యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 2020 సంవత్సరానికి గానూ ‘హైదరాబాద్ టైమ్స్ ఫరెవర్ డిజైరబుల్’ లిస్ట్ లో చేరిపోయారు. ఈ పాన్ ఇండియా స్టార్ కు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. గతంలో “ఫరెవర్ డిజైరబుల్” లిస్ట్ లో టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఉన్నారు. అయితే ఆ తరువాత మళ్ళీ వీళ్ళెవరూ ఈ లిస్ట్ లో కన్పించలేదు. గత సంవత్సరం మహేష్ బాబు ఫరెవర్ డిజైరబుల్ మాన్ గా ఎంపికయ్యారు. కాగా ప్రభాస్ ఇప్పుడు 4 విభిన్నమైన పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం “రాధే శ్యామ్” అనే రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు. ఈ ఏడాది చివర్లో ఇది తెరపైకి రానుంది. ప్రభాస్- ప్రశాంత్ నీల్-కాంబినేషన్ లో యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’, ఓం రౌత్ పౌరాణిక నాటకం ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్‌తో కలిసి సైన్స్ ఫిక్షన్ మూవీ చేయనున్నారు. ఇందులో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ నటించనున్నారు.