Ranbir Kapoor: ‘షంషేరా’ నుండి లీకైన రణ్‌బీర్ ఫస్ట్‌లుక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పరిచయం అక్కర్లేని పేరు బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్. ఇప్పటివరకు ఈయన నటించిన ఒక్క సినిమా కూడా తెలుగులో విడుదల కాలేదు. అయినా కానీ తెలుగు ప్రేక్షకులలో రణ్‌బీర్‌పై ఎనలేని అభిమానం ఉంది. ఇటీవలే వైజాగ్‌లో జరిగిన ఫ్యాన్స్ మీట్‌లో అది రుజువైంది కూడా. రణ్‌బీర్ కూడా తెలుగు ప్రేక్షకులు తనను అంతగా ఆదరిస్తారని అనుకొలేదని స్వయంగా తెలిపాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘షంషేరా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘సంజూ’ తరువాత దాదాపు నాలుగేళ్ళకు ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రణ్ బీర్. దాంతో బాలీవుడ్‌లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా తాజాగా ఈ చిత్రం నుండి రణ్‌బీర్ పోస్టర్ లీక్ అయ్యింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అభిమానులందరు ఆ పిక్‌ను షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు.
ఈ పోస్టర్‌లో రణ్‌బీర్ గుబురు గడ్డంతో, చేతిలో గొడ్డలి పట్టుకుని ఇంటెన్సీవ్ కళ్లతో చూస్తున్నాడు. ఈ పోస్టర్ సినిమాపై తీవ్ర ఆసక్తిని పెంచుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియోలో ఈ పోస్టర్ వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో రణ్‌బీర్ 1800 కాలం నాటి స్వాతంత్య్ర కాంక్ష కలిగిన దోపిడి ముఠా నాయకుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, వాణీ కపూర్‌లు కీలకపాత్రల్లో నటించారు. యష్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 22న విడుదలకానుంది. దీనితో పాటుగా ఈయన నటించిన ‘బ్రహ్మాస్త్రం’ కూడా ఇదే ఏడాది సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ప్రస్తుతం రణ్‌బీర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.
Also Read
- Nagavamsi: బాక్సాఫీస్ కలెక్షన్లపై నాగవంశీ బాంబ్.. ఐటీ వాళ్లకి అసలు లెక్కలన్నీ తెలుసట!
- Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
- Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!
- Box Office Numbers: బాక్సాఫీస్ పోస్టర్లపై నాగవంశీ కామెంట్స్ వైరల్.. ‘ఇప్పటికీ నంబర్లు ఇన్‌ఫ్లేట్ అవుతున్నాయి’!
తాజావార్తలు
-
Nagavamsi: బాక్సాఫీస్ కలెక్షన్లపై నాగవంశీ బాంబ్.. ఐటీ వాళ్లకి అసలు లెక్కలన్నీ తెలుసట!
-
Vegetable Chips: బయట ఫుడ్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
-
ISRO Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో జాబ్స్‌కి నోటిఫికేషన్!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్‌ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!