Family Star Grand Pre-release event: ఖుషి సినిమా తరువాత పరుశురాం దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్ ‘. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.. వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహారిస్తున్నారు.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, పోస్టర్స్, టీజీర్, సాంగ్స్ ప్రేక్షకులు దగ్గర నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఫ్యామిలీ విలువలను పెంచేలా అద్భుతంగా ఉంది ట్రైలర్. ఫ్యామిలి ఎమోషన్స్, విజయ్ దేవరకొండ డైలాగులు ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.
Also Read; Chiranjeevi : నాకు ఎలాంటి సినిమాలు ఇష్టమో చెప్తే నవ్వుతారు..
ఇక ఈ సినిమా ఏప్రిల్ 5న పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ రానుండగా.. ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడప్ చేసారు చిత్ర యూనిట్…మైసమ్మగూడ, నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఏప్రిల్ 2న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది.ఇక ఈ సినిమాలో మిడిల్ క్లాస్ మ్యాన్‍గా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నారు.. అలాగే మూవీలో రష్మిక మందన్న అతిధి పాత్రలో నటించగా, దివ్యాంశ కౌశిక్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈ సినిమాకు గోపి సుందర్ చక్కటి సంగీతాన్ని అందించారు..ఇక ఈ సినిమా బుకింగ్స్ కూడా ఆన్లైన్ లో రిలీజ్ చేసారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన గీతగోవిందం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీనితో ఫ్యామిలీ స్టార్ మూవీపై అంచనాలు భారీగా వున్నాయి.