కొద్ది రోజుల క్రితం వార్ 2 సినిమా రిలీజ్ అయిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌ను అసభ్యకరంగా సంబోధించాడంటూ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆడియో ఒకటి వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు దగ్గుబాటి ప్రసాద్ మీద విరుచుకుపడడమే కాక, ఆయన నివాసానికి వెళ్లి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అయితే, తాను అలా మాట్లాడలేదని, తన వాయిస్‌ను ఏఐతో క్రియేట్ చేసి అలా వైరల్ చేశారని ఆయన అప్పట్లో క్లారిటీ ఇచ్చారు. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు అదే ఎమ్మెల్యే, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఒక స్పెషల్ వీడియో షేర్ చేయడమే కాదు, సుదీర్ఘంగా రాసుకొచ్చారు. అయితే అది ఆయన ఒరిజినల్ అకౌంట్ కాదు, ఆయన పేరుతో ఉన్న ఒక ఫేక్ అకౌంట్.
Also Read :OG: ఓజీ కమింగ్ సూన్.. లీక్ చేస్తామంటూ IBomma హెచ్చరిక
ఈ రోజు విడుదల అయ్యే పవన్ కళ్యాణ్ గారి సినిమాకు నా హృదయపూర్వక అభినందనలు. మంచి మనసున్న మంచి మనిషి, అంధకార సమయంలో మా పార్టీకి అండగా నిలిచి అచంచలమైన మద్దతు ఇచ్చారు. మేము కూడా ఆయన కోసం ఎప్పటికీ అండగా నిలబడతాం. అనంతపురంలో నేనే దగ్గరుండి ఎలాంటి సమస్యలు లేకుండా సినిమా విడుదల చేయిస్తానంటూ ఆయన పేర్కొన్నారు. దగ్గుబాటి ప్రసాద్ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా, పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఉంటూనే, ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు తాజాగా దగ్గుబాటి ప్రసాద్ పేరుతో చేసిన ఫేక్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది.
