Site icon NTV Telugu

Fahadh Faasil: పుష్ప2 పై సంచలన వ్యాఖ్యలు

Fahadh Faasil (2)

Fahadh Faasil (2)

మలయాళ సినిమా పరిశ్రమలో స్టార్ ఇమేజ్ ఉన్న ఫహద్ ఫాసిల్, తన అద్భుతమైన నటనతో హీరో పాత్రల్లోనూ, ఇతర ఇంపార్టెంట్ పాత్రల్లోనూ మెప్పించారు. అయితే, తాజాగా ఆయన నటించిన తెలుగు చిత్రం పుష్ప 2: ది రూల్లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఆయన నటన బాగానే ఉన్నా ఆయన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో ఆయన పాత్ర అంత పవర్ ఫుల్ గా లేకపోవడంతో, ఫహద్ ఈ ప్రాజెక్ట్‌పై నిరాశ వ్యక్తం చేశారు.

Also Read:Kamakhya: అదిరే అభి డైరెక్షన్లో సముద్రఖని ‘కామాఖ్య’

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఫహద్ ఫాసిల్, పుష్ప 2 గురించి నేరుగా ప్రస్తావించకుండా, “గత ఏడాది ఒక పెద్ద సినిమాలో నేను ఫెయిల్ అయ్యాను. దాని గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు, అలాంటప్పుడు దాన్ని వదిలేయాలి. పాఠం నేర్చుకోవాలి” అని అన్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్‌కు కూడా ఫహద్ హాజరు కాలేదు, ఇది పుష్ప విషయంలో ఆయన ఎంత నిరాశ పడ్డాడు అనే విషయాన్ని తేటతెల్లని చేస్తోంది. నిజానికి సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఫహద్ ఫాసిల్ ఒకరు. మలయాళంతో పాటు తమిళ, తెలుగు చిత్రాల్లో కూడా ఆయన బిజీగా ఉన్నారు. *పుష్ప 2*తో ఆయనకు ఆశించిన విజయం లభించకపోయినప్పటికీ ఆయనను ఇప్పటికీ హాట్ ఫేవరెట్.

Exit mobile version