NTV Telugu Site icon

Mahesh Babu : ఫ్యాన్స్‌కి SSMB29 నుంచి అదిరిపోయే వార్త

Untitled Design (90)

Untitled Design (90)

ప్రజెంట్ టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ లలో ‘SSMB29’ ఒకటి. టాలెంటెడ్ దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం యావత్ సినీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను అడవి నేపథ్యంలో తెరకెక్కించనున్నారు జక్కన్న.ఇప్పటికే షూటింగ్ మొదలు కాగా, ఇందుకోసం ఆయన లొకేషన్ల వేట కూడా పూర్తి చేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం రెండో షెడ్యూల్ కోసం సిద్ధమైంది.

Also Read: Ananya : ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఆమెను చూసి నేర్చుకున్నా

ఇందులో భాగంగా ఈ రెండో షెడ్యూల్‌ను తూర్పు కనుమలలో చిత్రీకరించేందుకు వెళ్లింది మూవీ టీం. కాగా ప్రజంట్ ఒడిశాలో ఈ చిత్ర యూనిట్ ల్యాండ్ అయ్యింది. ఇక ఎయిర్‌పోర్ట్‌లో మహేష్ బాబుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో మరో వెర్సటైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నట్లు ఈ మధ్య వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కూడా ఈ టీమ్ వెంట ఒడిశాకు చేరుకున్నాడు.

దీంతో ఈ మూవీకి పృథ్వీరాజ్ కారణంగా మాలీవుడ్, దుబాయ్ కంట్రీస్‌లో మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక హాలీవుడ్ మార్కెట్ కోసం ప్రియాంక చోప్రా ఎలాగూ ఉంది. నార్త్ మార్కెట్‌ను రాజమౌళి చూసుకుంటారు. సౌత్, తెలుగు మార్కెట్ మొత్తాన్ని కూడా మహేష్ బాబు ఉన్నాడు. మొత్తానికి ఈ మూవీ పాన్ వరల్డ్‌గా మారనుంది.