EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘బేబి’ వంటి ట్రెండ్ సెట్టింగ్ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య కాంబినేషన్లో వచ్చిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ‘90s’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యూత్, రొమాన్స్ మరియు ఎమోషన్స్ ప్రధానంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ‘A’ సర్టిఫికేట్ జారీ చేసింది. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు డిజిటల్ ప్రిమియర్ కోసం సిద్ధమైంది.
ఈ చిత్రం అక్టోబర్ 9 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో తమిళం, కన్నడ, మలయాళం, మరియు హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. యువతను ఆకట్టుకునే కథాంశం కావడం, ఆనంద్-వైష్ణవి జోడీకి మంచి క్రేజ్ ఉండటంతో ఓటీటీ ప్రేక్షకులలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ తెచుకుంటుందో చూడాలి. తెలంగాణ నేపథ్యంలో మొదలై యూకే బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించారు. హెషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం, లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు, ఈ అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఎపిక్’ మూవీని వీక్షించవచ్చు.
Also Read
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!