PEDDI: 80ల నాటి విజయనగరం కోసం ఏకంగా 24 భారీ సెట్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PEDDI: టాలీవుడ్లో ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్న ప్రాజెక్ట్ పెద్ది. ఈ సినిమా గురించి బయటకు వస్తున్న ఒక్కో వార్త అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తోంది, తాజాగా ఈ చిత్ర ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల పంచుకున్న విశేషాలు సినీ వర్గాల్లో సెన్సేషన్‌గా మారాయి. 70, 80ల నాటి నెటివిటీని వెండితెరపై పునఃసృష్టి చేసేందుకు చిత్ర బృందం ఎంతలా కష్టపడుతుందో ఆయన వివరించారు. సాధారణంగా ఏదైనా పీరియడ్ డ్రామా తీయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అందుకే ‘పెద్ది’ విషయంలో మేకర్స్ ఎక్కడా రాజీ పడలేదు. ఈ సినిమా ప్రపంచాన్ని నిర్మించడం కోసం కేవలం ప్రీ-ప్రొడక్షన్ పనులకే దాదాపు ఒక సంవత్సరం పాటు సమయం కేటాయించినట్లు అవినాష్ కొల్లా వెల్లడించారు. విజయనగరం జిల్లాలోని మారుమూల పల్లెటూళ్లలో 1970 – 80ల కాలంలో ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టేలా చూపించడమే ఈ సినిమా ప్రధాన లక్ష్యం.
ఈ చిత్రానికి సంబంధించి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సినిమా కోసం ఏకంగా 24 భారీ సెట్లను రూపొందించారు. ఆ కాలం నాటి ఇళ్లు, వీధులు, వాతావరణం ప్రతిబింబించేలా ఈ సెట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారు. నేటి ఆధునిక కాలంలో ఆ పాత తరం నాటి ‘రస్టిక్’ లుక్‌ను తీసుకురావడం ఒక సవాల్‌గా అనిపించినా, విజువల్స్‌లో ఆ మ్యాజిక్ ఖచ్చితంగా కనిపిస్తుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. విజయనగరం మట్టి వాసన, అక్కడి యాస, ఆ కాలం నాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఆర్ట్ డైరెక్షన్ పరంగా అవినాష్ కొల్లా తీసుకున్న జాగ్రత్తలు, ఆ 24 భారీ సెట్లు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్తాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!