Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హీరో, సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. ‘గన్‌మాస్టర్ G9’ సినిమా కోసం ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్రేన్‌కు వేలాడదీసిన ఎస్యూవీ గాల్లో పల్టీలు కొడుతూ.. కింద పార్క్ చేసి ఉన్న వ్యాన్‌పై పడింది. ఆ కారు ఇమ్రాన్ హష్మీకి అత్యంత సమీపంలోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. ముందుగా చిత్రబృందం స్టంట్‌కు సిద్ధమయింది. కౌంట్‌డౌన్ చెప్పగానే క్రేన్‌కు వేలాడదీసిన ఎస్యూవీ గాల్లో తిరుగుతూ తలకిందులుగా మారి కింద ఉన్న వ్యాన్ పైకప్పుపై బలంగా పడింది. ఈ వ్యాన్‌కు అతి సమీపంలోనే హీరో ఇమ్రాన్ హష్మీ ఉన్నట్లు సమాచారం. దీంతో చిత్ర బృందం వేంటనే అప్రమత్తమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.
Also Read
ఆదిత్య దత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గన్‌మాస్టర్ జీ9 విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీతో పాటు జెనీలియా దేశ్‌ముఖ్, అపారశక్తి ఖురానా, అభిషేక్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్, రొమాన్స్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆగస్టులో విడుదల చేసిన సినిమా ఫస్ట్ గ్లింప్స్‌లో హీరో పాత్రను పరిచయం చేశారు. ఇందులో ఆయన ఈశ్వర్ అనే డెయిరీ ఫామ్ యజమానిగా కనిపించనున్నారు. తాను ప్రేమించే మహిళను రక్షించేందుకు ఎంతటి సాహసానికైనా సిద్ధపడే వ్యక్తిగా ఆయన పాత్రను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
-
RC 17: సినిమా ఓపెనింగ్ కాదు.. ఆఫీస్ మాత్రమే.!
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
-
Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!