Site icon NTV Telugu

Ee Nagaraniki Emaindi 2 : ‘ఈ నగరానికి ఏమైంది 2’ పై తరుణ్ పోస్ట్ వైరల్..

Ee Nagaraniki Emaindi 2

Ee Nagaraniki Emaindi 2

యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న దర్శకుల్లో తరుణ్ భాస్కర్ ఒకరు. పెళ్లి చూపులు’తో టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షించి, రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ యూత్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమాటం, వెంకటేష్ కాకుమాను, సుశాంత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, కొత్త తరహా కథతో ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ సినిమాకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఓటీటీ లో అయితే ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇక ఈ సినిమా రీ రిలీజ్ లో కూడా ఊహించని కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

Also Read : Kannappa : ‘కన్నప్ప’ ఓటీటీ డీల్ పై మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

అందకని ఈ మూవీ ఫ్యాన్స్ కోసం ఇప్పుడు తరుణ్ భాస్కర్ సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నాడు.. దీని కోసం కూడా చాలా మంది ఎంతో ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా లేటెస్ట్ గా తరుణ్ భాస్కర్ విడుదల చేసిన ఓ పోస్ట్ మరింత ఎగ్జైట్మెంట్‌గా ఉంది. తాజాగా తరుణ్ ‘ది ఎండ్’ అంటూ ఒక పిక్ ని తన లాప్టాప్ పై తీసి పోస్ట్ చేసాడు. దీంతో ఇది ఈ ‘నగరానికి ఏమైంది 2’ స్క్రిప్ట్ కోసమే అని అందరికీ అర్ధం అయ్యింది. ఇక ఈ పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఈ పోస్ట్ పై కామెంట్స్ చేస్తున్నారు.. మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ కావాలని కోరుతున్నారు.

 

Exit mobile version