యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న దర్శకుల్లో తరుణ్ భాస్కర్ ఒకరు. పెళ్లి చూపులు’తో టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షించి, రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ యూత్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమాటం, వెంకటేష్ కాకుమాను, సుశాంత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, కొత్త తరహా కథతో ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ సినిమాకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఓటీటీ లో అయితే ఒక ట్రెండ్ సెట్ చేసింది.…
‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలతో దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు తరుణ్ భాస్కర్. ఇప్పుడు తరుణ్ భాస్కర్ నటుడుగానూ మారారు. అయితే అతని సమర్పణలో ఓ స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్ రూపొందుతోంది. ‘ఈ నగరానికి ఏమైంది’, ‘బొంభాట్’ చిత్రాలలో నటించిన సాయి సుశాంత్ రెడ్డి ఈ యాక్షన్ ప్యాక్డ్ స్పోర్ట్స్ ఫిల్మ్‌లో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో భైరవ్ పాత్రలో కనిపించనున్నారు సాయి సుశాంత్. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రమోద్…