ENE Repeat: ఈ నగరానికి ఏమైంది Repeat.. దుమ్మురేపెందుకు మళ్ళీ రెడీ

Ene Repeat

Ene Repeat

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యూత్‌కు ఒక కొత్త ట్రెండ్‌ను, కల్ట్ క్లాసిక్ స్టేటస్‌ను పరిచయం చేసిన సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’. థియేటర్లలోనే కాకుండా, రీసెంట్‌గా రీ-రిలీజ్ అయినప్పుడు కూడా హౌస్‌ఫుల్ బోర్డులతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపిన ఈ సినిమాకు ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ సిద్ధమైంది. అదే ‘ENE Repeat’. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ఆనాటి ఫ్రెండ్‌షిప్ మ్యాజిక్‌ను మళ్లీ స్క్రీన్ పై రిపీట్ చేయడానికి రీయూనియన్ అవ్వగా.. ఈ క్రేజీ గ్యాంగ్‌కు యంగ్ హీరో శ్రీనాథ్ మాగంటి తోడవ్వడం విశేషం. సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మరోసారి తన మార్క్ మేకింగ్‌తో ఈ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ‘ఎస్ ఒరిజినల్స్’, ‘రూట్ నోడ్ సినిమా’ బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా గ్లోబల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసి యూత్‌లో వైబ్స్ పెంచేశారు. ఈ మోస్ట్ అవేటెడ్ కల్ట్ సీక్వెల్‌ను నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటి భాగం విడుదలై విజయవంతంగా 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆనాటి ‘కన్యారాశి’ గ్యాంగ్ అల్లరిని, తాగుడు ముచ్చట్లను, గోవా జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఒక క్రేజీ ఫ్రెండ్‌షిప్ యాంథమ్ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన ‘ఫీల్-గుడ్’ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా కేవలం ఒక చిత్రం కాదు, అదొక ఎమోషన్. ముఖ్యంగా నేటి తరం యువతకు కనెక్ట్ అయిన డైలాగ్స్ ఈ సీక్వెల్‌లో అంతకు మించి ఉండబోతున్నాయని, పార్ట్-1 వైబ్‌ను ఏమాత్రం మిస్ కాకుండా డబుల్ ఎంటర్టైన్‌మెంట్ అందించబోతున్నామని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.