Dulquer Salmaan : సెంచరీకి చేరువలో ‘లక్కీ భాస్కర్’
- సూపర్ హిట్ సాధించిన లక్కీ భాస్కర్
- వందకోట్లకు చేరువలో లక్కీ భాస్కర్
- తెలుగులో హ్యాట్రిక్ కొట్టిన లక్కీ భాస్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ హిట్ “లక్కీ భాస్కర్”.వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా అటు క్రిటిక్స్ ను ఇటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో కథానాయికగా నటించింది. తమిళ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయింది.
Also Read :Kiran Abbavaram : “క” మూవీ టీమ్ కు మెగాస్టార్ చిరంజీవి ప్రశంస
Also Read
తోలి ఆట నుండి సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ సినిమా దుల్కర్ నటన, వెంకీ అట్లూరి దర్శకత్వం ఆడియెన్స్ ను అలరించింది. బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న ఈ సినిమా తోలి రోజు రూ. 12.7 కోట్లు కొల్లగొట్టి దుల్కర్ కి టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ తెచ్చిపెట్టింది. ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తోలి ఆట నుండి సూపర్ హిట్ టాక్ అందుకుంది. డబ్బు అన్నిటికి మూలం, అది ఉంటేనే ఎవరికైనా వాల్యూ ఉంటుంది అనే కథాంశంతో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో 11 రోజులకు గాను 96. 08 కోట్లు సాధించింది. తెలుగులో స్టడీగా కలెక్షన్స్ వస్తున్న ఈ సినిమా తమిళ్ లో ఊహించినదానికంటే ఎక్కువ పర్ఫామ్ చేస్తోంది. ఇప్పటికి రూ. 11కోట్లకు పైగా రాబట్టి బయ్యర్స్ కు లాభాలు తెచ్చి పెట్టింది. ఇక మరో రెండు రోజుల్లో ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరనుంది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?