Dulquer Salman: ‘ఐ యామ్ గేమ్’ కోసం నాగ్ అశ్విన్ ఎడిటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తూ, స్వయంగా నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఐ యామ్ గేమ్’ (I’m Game) తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేదికపై దుల్కర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తన సొంత ప్రొడక్షన్ లో చేస్తున్న ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో చెబుతూనే, ఈ సినిమాకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ అందించిన సహాయం గురించి దుల్కర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమా ట్రైలర్ చూసి మీరు ఒక అంచనాకు వచ్చి ఉంటారని, కానీ తాము ట్రైలర్ లో అంతా చూపించలేదని, సినిమాలో అందరినీ సర్ ప్రైజ్ చేసే ఒక అద్భుతమైన ఎలిమెంట్ దాగి ఉందని దుల్కర్ సెన్సేషనల్ సీక్రెట్ లీక్ చేశారు. అంతేకాకుండా, ఈ సినిమా చూసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎడిటింగ్ లో తమకు ఎంతో సహాయం చేశారని వెల్లడించారు. స్ట్రెయిట్ తెలుగు సినిమా తరహాలో ఉండే ఈ చిత్రానికి తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నట్లు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 3న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రం ఆడియన్స్ ను కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
తెలుగు ప్రేక్షకులు సినిమాను, స్టార్లను ఆదరించే తీరు అద్భుతమని దుల్కర్ ప్రశంసించారు. ఈ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన సుమ గారి డేట్స్ ఉంటేనే తాను హైదరాబాద్ ప్రమోషన్స్ ప్లాన్ చేసుకుంటానని, సుమ గారు ఉంటే తన యాక్టర్స్ కూడా చాలా సేఫ్ గా ఫీల్ అవుతారని ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈవెంట్లో సరదాగా సాగిన గేమ్‌లో భాగంగా పలు ఆసక్తికర ప్రశ్నలకు దుల్కర్ బదులిచ్చారు. తన కెరీర్ లో ‘మహానటి’ ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ అని, తనకు భాష రాకపోయినా నేర్పించి ఇంతటి తెలుగు కెరీర్ ఇచ్చింది నాగ్ అశ్విన్, స్వప్న, ప్రియాంకలే అని కృతజ్ఞతలు తెలిపారు. నాగ్ అశ్విన్ ఫోన్ చేసి రేపు షూటింగ్ ఉందంటే ఏమీ ఆలోచించకుండా వెంటనే వెళ్లిపోతానని ఒక గాసిప్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తన తండ్రి మమ్ముట్టి నటించిన చిత్రాల్లో ‘దళపతి’ తనకు ఎంతో ఇష్టమని, తాను నాలుగేళ్లు చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ ఒక్క డీవీడీ (DVD) మాత్రమే తన వెంట తీసుకెళ్లానని ఎమోషనల్ అయ్యారు. తనకు జీవితాంతం తినగలిగే ఇష్టమైన ఫుడ్ ‘బిర్యానీ’ అని, తాను ఎక్కడికి వెళ్లినా వివిధ రకాల బిర్యానీలను తప్పక టేస్ట్ చేస్తానని దుల్కర్ తన మనసులోని మాటలను పంచుకున్నారు.
Also Read
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- AA 23 : అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
- DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా 'డిగ్గర్'
- Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
తాజావార్తలు
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!