NTV Telugu Site icon

Dulquer: మరోక ఇంట్రెస్టింగ్ సినిమాలో దుల్కర్..టైటిల్ ఏంటంటే.?

Untitled Design (5)

Untitled Design (5)

టాలివుడ్ లోని పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు ఒకవైపు భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూనే మరోవైపు చిన్న సినిమాలు కూడా నిర్మిస్తున్నాయి. ఇది ఒక రకంగా మంచికే అని చెప్పాలి. మిడ్ రేంజ్ హీరోలు, దర్శకులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి అదొక అవకాశం. చిన్న సినిమాతో హిట్ అందిస్తే అదే బ్యానర్ లో భారీ బడ్జెట్ చిత్రం చేసేందుకు వెసులుబాటు దొరుకుతుంది.

ఇదిలా ఉండగా టాలీవుడ్ లో రెండు, మూడు టాప్ ప్రొడక్షన్ హౌస్ లు కలిసి సినిమాలు నిర్మించడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. సితార ఎంటర్టైన్మెంట్స్, త్రివిక్రమ్ ఫార్ట్యూన్ ఫోర్ కలిపి సినిమాలు చేస్తుంటారు. కాగా మరో ముగ్గురు బడా ప్రొడ్యూసర్స్ చేతులు కల్పబోతున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్, కల్కి వంటి పాన్ వరల్డ్ సినిమా నిర్మించిన స్వప్న సినిమా, గుణ్ణం సందీప్ లైట్ బాక్స్ బ్యానర్స్ కలయికలో ఓ చిత్రం పట్టాలెక్కనుంది.

మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా రానున్న చిత్రాన్ని వీరిఇరువురు సంయుక్తంగా నిర్మించనున్నారు. దుల్కర్ వరుసగా స్ట్రయిట్ తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ఆకాశంలో ఒక తార’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు నిర్మాతలు ఈ మేరకు టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. గతంలో స్వప్న సినిమాస్ బ్యానర్ లో సీతారామం చిత్రంలో నటించాడు దుల్కర్. కాగా ఈ చిత్రానికి పవన్ సాధినేని దర్శకత్వం వహించబోతున్నాడు. గతంలో నారా రోహిత్ హీరోగా వచ్చిన సావిత్రి,  రాజేంద్రప్రసాద్  సేనా పతి, లవ్ఇష్క్ కాదల్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు పవన్ సాధినేని.

 

Also Read: Soori : చిన్న చిత్రంగా విడుదలై 50 డేస్ కంప్లీట్ చేసుకున్న చిత్రం