Dude : ‘డ్యూడ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘డ్యూడ్’ సినిమా ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ మిశ్రమంగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలైన క్షణం నుంచి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ప్రదీప్ రంగనాథన్ ఎనర్జీ.. మామితా బైజు మరియు నేహా శెట్టి లు గ్లామర్, నటన పరంగా యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక కీర్తిశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం వినోదంతో పాటు ఎమోషనల్ గా కూడా బాగా ఆకట్టుకుంది. ఫలితంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, ప్రదీప్ కెరీర్‌లో హ్యాట్రిక్ 100 కోట్ల గ్రాసర్‌గా నిలిచింది.
Also Read : Prabhu : నటుడు ప్రభు ఇంటికి బాంబు బెదిరింపు – చెన్నైలో పోలీసుల హడావిడి!
Also Read
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
- BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
- Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
- The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ‘డ్యూడ్’ చిత్రం నవంబర్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫారమ్‌లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కానుందనే టాక్ ఫిల్మ్‌సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. అంటే, తెలుగు, తమిళం, హిందీతో పాటు మరికొన్ని భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత కూడా సోషల్ మీడియాలో అభిమానులు “డ్యూడ్ ఓటీటీ ఎప్పుడు?” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందనే వార్త వాళ్లలో మరింత ఉత్సాహం నింపుతోంది.
ఇక ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ అందించిన మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి సాంగ్ యూత్ ప్లేలిస్టుల్లో స్థానం సంపాదించుకుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమా, కోలీవుడ్‌లో మాత్రమే కాకుండా పాన్ ఇండియా మార్కెట్‌లోనూ మంచి బిజినెస్ సాధించింది. మైత్రి బ్యానర్‌కు మరో గోల్డెన్ హిట్ జతచేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికపై మరలా అదే జోష్‌తో ప్రేక్షకులను అలరించబోతోంది.
తాజావార్తలు
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
-
Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!