తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ‘దృశ్యం’ మూడో భాగంపై తాజాగా స్పష్టత వచ్చింది. ‘దృశ్యం 3’ సినిమాను విక్టరీ వెంకటేష్‌తో తెరకెక్కిస్తున్నట్లు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు అధికారికంగా తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్‌లోనే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో కొంతకాలంగా వినిపిస్తున్న వాయిదా వార్తలు, అనుమానాలకు తెరపడింది. త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తర్వాత ‘దృశ్యం 3’ కోసం వెంకీ మామ రంగంలోకి దిగనున్నారు.
Also Read: Rohit Sharma Indore Incident: రోహిత్ శర్మ చేతిని లాగిన మహిళ.. షాక్ తిన్న హిట్‌మ్యాన్!
వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం నెం.47’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక ‘దృశ్యం 3’ సెట్స్‌పైకి వెళ్లనుంది. గత రెండు భాగాల్లో వెంకటేష్ నటనకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన దృష్ట్యా.. మూడో భాగంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇదిలా ఉండగా.. దృశ్యం అసలు వెర్షన్ అయిన మలయాళ ‘దృశ్యం 3’ కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా 2026 సమ్మర్లో విడుదల కానుంది. కథలో మరిన్ని మలుపులు, ఉత్కంఠభరిత సన్నివేశాలతో ‘దృశ్యం 3’ ప్రేక్షకులను మరోసారి కట్టిపడేస్తుందనే నమ్మకం చిత్ర బృందం వ్యక్తం చేస్తోంది. అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభమైతే.. వచ్చే ఏడాది దృశ్యం 3 విడుదల కానుంది. సురేష్ బాబు కన్ఫర్మేషన్‌తో వెంకటేష్ అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.