Site icon NTV Telugu

Chikiri : లంగావోణీ వేసినా, శారీ కట్టినా జాన్వీ ఎక్స్ పోజింగ్ చేయాల్సిందేనా..?

Janvi

Janvi

దేవరతో తంగంగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్. తొలి సినిమాతోనే భారీ హిట్ కొట్టింది. ఆ సినిమాలో తన పాత్ర కొంత మేరకే ఉన్న తన అందచందాలతో మురిపించింది జాన్వీ. ఇప్పుడు మరోసారి పల్లెటూరి పడుచు అమ్మాయిగా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. రామ్ చరణ్ పెద్దిలో అచ్చియమ్మగా నటిస్తోంది జానూ. పేరుకు రూరల్ అమ్మాయే కానీ గ్లామరస్ లుక్కులో కుర్రకారు మతి పొగొడుతోంది. లంగావోణీ కట్టినా, శారీ ధరించినా ఎక్స్ పోజింగ్ చేయాల్సిందే.

Also Read : Mohanlal : రెండు సార్లు వాయిదా.. ముచ్చటగా మూడోసారి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న వృషభ

ఈ ఏడాది టాలీవుడ్ కు గ్యాప్ ఇచ్చిన జానూ  హిందీలో మాత్రం మూడు సినిమాలతో సందడి చేసింది. నార్త్ అబ్బాయి, సౌత్ గర్ల్స్ స్టోరీతో వచ్చిన పరమ్ సుందరి కాంట్రవర్సీలో మునిగి బాక్సాఫీస్ దగ్గర అండర్ ఫెర్మామెన్స్ చేసింది. ఇక సన్నీ సంస్కారీ కి తులసి కుమారి పేరుకు వంద కోట్లు తెచ్చింది కానీ బ్రేక్ ఈవెన్ కాలేకపోయిందని టాక్. అలాగే ఆస్కార్ రేసులో నిలిచిన హోంబౌండ్ అయితే ఎప్పుడొచ్చిందో, పోయిందో కూడా తెలియదు. ఇప్పుడు జాన్వీ ఆశలన్ని పెద్ది సినిమాపైనే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పెద్దిలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది జాన్వీ. రంగస్థలంలో చిట్టిబాబుగా రా అండ్ రస్టిక్ లుక్కులో కనిపించిన చరణ్, పెద్దిలోనూ ఈ తరహా క్యారెక్టర్ డిజైన్ చేశాడు బుచ్చి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో.. ఓ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న సినిమాలో.. జానూని చికిరిగా చూపించబోతున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ సింగిల్ చికిరి చీకిరిలో జాన్వీ కనిపించింది కాసేపైనా కూడా అందాలు ఆరబోసి మెప్పించింది. భారీ అంచనాల మధ్య వస్తున్న పెద్ది నెక్ట్స్ ఇయర్ మార్చి 27న రిలీజ్ కాబోతోంది.

Exit mobile version