Mohanlal : రెండు సార్లు వాయిదా.. ముచ్చటగా మూడోసారి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న వృషభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోహన్ లాల్ అప్ కమింగ్ ఫిల్మ్ వృషభ అనుకున్నట్లే వాయిదా పడింది. రూ. 70 కోట్లతో తెరకెక్కిన ఈ బైలింగ్వల్ ఫిల్మ్ తొలుత అక్టోబర్ 18న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. అందుకు సంబంధించి అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. కానీ అనుకోని కారణాలతో నవంబర్ 6కి పోస్ట్ పోన్ చేస్తున్నారు ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా టీమ్ నుండి ఎలాంటి హడావుడి చేయకపోవడంతో సినిమా వాయిదా పడుతుందన్న వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ రీసెంట్‌గా మరోసారి పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు యూనిట్.
Also Read : Bollywood : రూట్ మార్చిన బాలీవుడ్.. వార్ సినిమాలపైనే ఫోకస్.. కారణం ఏంటి?
Also Read
- Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్‌ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
- Elon Musk: ఇక 5 - 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
- Gaddam Prasad: ‘మీ తల్లిని అనలేదు హరీష్.. నా తల్లిని దూషించారు’.. అసెంబ్లీలో స్పీకర్ ఆగ్రహం
- Rahul Gandhi New Team: రాహుల్ గాంధీ కొత్త టీమ్ రెడీ.. 120 మంది నేతలను స్వయంగా ఇంటర్వ్యూ
ఇప్పుడు లేటెస్ట్ గా మరోడేట్ ను ఫిక్స్ చేసారు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న వృషభ థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. టాలీవుడ్ లో ఈ క్రిస్మస్‌కు పోటీ రాను రానూ పెరిగిపోతోంది. టాలీవుడ్ లో డిసెంబర్ నుండి డెకాయిట్ తప్పుకోగానే, రేసులోకి దూసుకొచ్చాయి రోషన్ ఛాంపియన్, ఆది సాయి కుమార్ శంభాల సినిమాలు. వీటితో పాటు గుణశేఖర్ యుఫోరియా కూడా అదే డేటుకు రాబోతోంది. తాజాగా అడివి శేష్ తప్పుకున్న డేట్ కు వృషభ కర్చీఫ్ వేసింది. అయితే ఈ సినిమా ఇన్నిసార్లు వాయిదా పాడడానికి వీఎఫ్ఎక్స్ కారణం అని సమాచారం. మోహన్ లాల్‌కు భారీ ప్రాజెక్ట్ చిత్రాలు అస్సలు కలిసి రావడం లేదు. ఎంపురన్ మినహాయిస్తే, వంద కోట్లతో తీసిన మరక్కార్, మలికోట్టై వాలిబన్, లాస్ట్ ఇయర్ దర్శకత్వం చేపట్టిన బర్రోజ్ కూడా డిజాస్టర్ అయ్యాయి. నందకిశోర్ దర్శకత్వంలో రూ. 70 కోట్లతో తెరకెక్కిన వృషభ భారీ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్‌ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
-
Pralay Movie: ఈసారి ప్రళయమే.. ‘ధురందర్’ తర్వాత అదిరిపోయిన రణ్వీర్ ‘ప్రళయ్’ కొత్త లుక్..
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Karan Johar : స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్3కి కరణ్ జోహార్ ప్లాన్
-
Gaddam Prasad: ‘మీ తల్లిని అనలేదు హరీష్.. నా తల్లిని దూషించారు’.. అసెంబ్లీలో స్పీకర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!