NTV Telugu Site icon

Jabardasth: వేణుమాధవ్‌తో ఉన్న ఈ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా? ఇప్పుడు జబర్దస్త్ స్టార్ కమెడియన్!

Racha Ravi

Racha Ravi

ఈ ఫోటో చూస్తుంటే వన్స్ మోర్ ప్లీజ్ అనే షో గుర్తు వస్తుంది ఆ షో పరిచయం ఉన్నవారికి. ఈ టీవీ షోతోనే వేణు మాధవ్‌ కెరీర్ ఆరంభించి సినిమాల్లోకి అడుగు పెట్టి స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఉదయభాను కూడా స్టార్‌ యాంకర్‌గా తెలుగు ఆడియెన్స్ కు ఈ షో ద్వారానే చేరువైంది. ఇక ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఒక జబర్దస్త్ కమెడియన్‌ కూడా ఉన్నాడు. కెరీర్‌ ప్రారంభంలో అతను మిమిక్రీ ఆర్టిస్టుగా వన్స్‌ మోర్‌ ప్లీజ్‌ టీవీషోలో పాల్గొని అదృష్టం పరీక్షించుకున్నాడు. అప్పటిదే ఈ ఫొటో. ఇందులో ఉదయభాను వేణు మాధవ్ ల మధ్య ఉన్నదెవరో ఇప్పటికైనా గుర్తు పట్టారా? లేదా? సరే ఎక్కువ కష్టపడకండి అతను ఒకప్పుడు జబర్దస్త్ లో ఇప్పుడు టాలీవుడ్‌లోస్టార్ కమెడియన్‌.

Dulquer : తెలుగు ప్రేక్షకుల ప్రేమ చూసి ఆశ్చర్యపోయా.. అదే కొత్తగా అనిపించింది: దుల్కర్ సల్మాన్ ఇంటర్వ్యూ

అదేనండీ కామెడీతో రచ్చ చేసే రచ్చ రవి. జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన రచ్చ రవి.. సినిమాలతో బిజీ అయ్యాడు. తెలంగాణ హన్ముకొండ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన రచ్చ రవి ఒక్కో మెట్టు ఎక్కుతూ నటుడిగా నిరూపించుకున్నారు. గద్దలకొండ గణేష్, ఎంసీఏ, ఒక్కక్షణం, నేనే రాజు నేనే మంత్రి, రాజా ది గ్రేట్, ఇటీవల ‘బలగం’ సినిమాలో ఆటో డ్రైవర్‌గా హీరోకి స్నేహితుడిగా ఇంపార్టెంట్ రోల్‌లో నటించి కామెడీ పండించాడు. అలా సినిమాలు చేస్తూ 2024 సైమా అవార్డ్స్ లో బెస్ట్ కమెడియన్గా, 2024 ఐఫా అవార్డ్స్ గాను బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కూడా నామినేట్ అయ్యాడు. ఇక ఇప్పుడు కూడా కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులలో నటిస్తున్నారు. ప్రస్తుతానికి రచ్చ రవి శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా “గేమ్ చేంజర్ ” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అలాగే మలినేని గోపీచంద్ దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న ” JAAT “అనే బాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు.

Show comments